తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఎంతో మంది ప్రేక్షకులను తన చిలిపి నవ్వుతో పడేసింది అనే చెప్పాలి. తనదైన చిలిపి నవ్వుతో అటు దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించి వరుస అవకాశాలు దక్కించుకుంది సమంత. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో సంచలన విజయాలు అందుకుంటూ వచ్చింది. ఇక డైరెక్ట్ గా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తూనే ఉంది సమంత. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు గడిచి పోతుంది ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఇంకా ఎక్కడా తగ్గలేదు. అంతేకాదండోయ్ యువ హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది ఈ అమ్మడు. 

 

 

 ఇక మొదట గ్లామర్ పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూనే మరో వైపు గ్లామర్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరు హీరోలతో నటించింది సమంత. ఇక మొదటి సినిమా నుంచే నాగచైతన్య తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హీరోయిన్ కి సినిమా అవకాశాలు రావు అని ఉన్న టాక్ ని  చెల్లా చెదురు చేస్తూ పెళ్లి తర్వాత మరింత హై స్పీడ్ తో దూసుకుపోతుంది సమంత. ఇకపై సమంతా కెరియర్ గురించి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనే చెప్పాలి. 

 

 

 ఎందుకంటే పెళ్లికి ముందు సమంత అందరు హీరోఇన్ లాగానే  ఒక స్టార్ హీరోయిన్ ఇమేజ్ వుండేది. కానీ పెళ్లికి తర్వాత కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ దూసుకుపోతున్నది.. సమంతా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ గా మారిపోయింది... అంతేకాకుండా సమంత సినిమాలంటే ఒక మంచి కంటెంట్ ఉంటుంది అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. సమంతకు పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత మరింత క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం హీరోయిన్ల అందరికీ ఒక ఐకాన్ గా మారిపోయింది సమంత. ఫిట్నెస్ విషయంలో నటన విషయంలో ఇలా అన్ని విషయాలలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ దూసుకుపోతుంది అక్కినేని వారి కోడలు సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: