సమంత అక్కినేని ఈ రోజు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తాను అద్భుతంగా నటించిన ఐదు సినిమాలు గురించి చెప్పుకుందాం.

1. ఏం మాయ చేసావే:

సమంత అక్కినేని నటించిన మొదటి చిత్రం మధ్యలోనే ఆగిపోయిందన్న సంగతి విధితమే. ఆ తర్వాత గౌతమ్ మీనన్ సమంతా ను ఎంతగానో బ్రతిమాలి మరీ తన చిత్రమైన ఏం మాయ చేశావే లో నటింపజేశాడు. ఈ చిత్రంలో నాగచైతన్య డైరెక్టర్ కావాలి అనుకుంటున్న ఒక హిందూ మెకానికల్ ఇంజనీర్ గా కనిపించగా... సమంత మలయాళ క్రిష్టియన్ అమ్మాయి గా నటించింది. ఈ సినిమా మొత్తం లో ఆమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. తన అందచందాలు గానీ నటన గానీ చాలా సహజంగా అద్భుతంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తన కెరీర్ లోనే ఉత్తమ చిత్రం గా పేర్కొనవచ్చు.


2. ఈగ:

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రంలో నాచురల్ స్టార్ నాని సరసన సమంత నటించింది. ఈ సినిమాలో నాని కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగా... సమంత ఒక్కటే బ్రహ్మాండంగా నటించి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసేసింది. ఈగ మూవీ లో తన ప్రియుడిని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రియురాలి పాత్రలో చాలా సహజంగా నటించింది సమంత. ఆమె నటనకు విమర్శకుల కూడా ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు.


3. యూ టర్న్:

కన్నడ రీమేక్ చిత్రం యూ టర్న్ లో సమంత అక్కినేని నటనకు హ్యాట్సాఫ్ చెప్పుకోవచ్చు. క్రైమ్ జర్నలిస్టుగా కనిపించిన సమంత తనలోని సరికొత్త నటన ప్రతిభను చూపి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ఒంటిచేత్తో కథనాన్ని నడిపించడమనేది ఒక పెద్ద సవాల్ గా చెప్పుకోవచ్చును. ఈ పెద్ద సవాల్ అని కూడా అలవోకగా ఎదుర్కొన్న సమంత తన నటనతో ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది.

4. సూపర్ డీలక్స్:

సినిమా చూస్తే సమంతకు ఎటువంటి వారైనా అభిమానులు కావడం తధ్యమని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బోల్డ్ అండ్ విచిత్రమైన కంటెంట్ తో తెరకెక్కిన సూపర్ డీలక్స్ లో సమంత చాలా బోల్డ్ క్యారెక్టర్ లో చాలా గొప్ప గా నటించింది. ఆ సినిమా ఓపెనింగ్ సీన్ లోనే సమంత నటన చూసి ప్రతి ఒక్కరు రెండు నిమిషాల పాటు అలానే ఉండిపోయారంటే నమ్మక తప్పదు. ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలు కొత్తగానే ఉంటాయి. ఏ విభిన్నమైన చిత్రానికి అగ్రతార సమంత తోడవడం ఒక పెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు.


5. ఓ బేబీ:

సౌత్ కొరియన్ కామెడీ చిత్రమైన మిస్ గ్రానీ రీమేక్ అయిన ఓ బేబీ లో సమంత నటనకు అందరూ ముచ్చటపడ్డారు. సమంతా లో ఇంత టాలెంట్ ఉందా అని ఓ బేబీ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకోక తప్పదు. ఒక 20 ఏళ్ల అమ్మాయి శరీరంలో 69 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ ఉంటే... అది ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించింది సమంత. 

మరింత సమాచారం తెలుసుకోండి: