ఒకప్పుడు అక్కినేని నాగార్జున అమల జోడికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంది నాగచైతన్య సమంత జోడి. ఏ మాయ చేసావే సినిమాతో కలిసి నటించిన ఇద్దరు మొదటి సినిమాతోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమాయణం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా కొనసాగింది. మీడియలో ఎక్కడ వీరిద్దరి గురించి ఫోటోలు లీక్ కాకపోయినప్పటికీ ఓ టాక్ మాత్రం మీడియాలో నడుస్తూనే వచ్చింది. చివరికి పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈ ఇద్దరి జంట ఎక్కడైనా కలిసింది అంటే చాలా బాగా సందడి చేస్తారు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ భార్య భర్తలు అన్నట్లుగా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లు గా కనిపిస్తూ ఉంటారు. అంత అర్థం చేసుకున్నారు కాబట్టే సమంత పెళ్లి తర్వాత కూడా ఇంకా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతూ అని చెప్పాలి. ప్రస్తుతం పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచారు. నాగచైతన్య తనదైన శైలిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతుంటే. మంచి కథలు ఎంచుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది సమంత .
అయితే ఓ ఇంటర్వ్యూలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్ లను బయటపెట్టినది . చైతూను తాను బెడ్ పై ఉన్నప్పుడు చైతూని ముద్దు పెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఎందుకంటే చైతూకి పిల్లోస్ అంటే ఎంతో ఇష్టమని... తన పక్కన నేను లేకున్న పర్లేదు కానీ పిల్లోస్ మాత్రం తప్పకుండా ఉండాలి అంటూ సమంత చెప్పింది. తాను నాగ చైతన్య ముద్దు పెట్టుకోవాలి అనిపించినప్పటికీ తాను ముద్దు పెట్టుకోవటానికి వెళ్తే... చైతూ పిల్లోస్ అడ్డు పెట్టుకుంటాడు అని చెప్పింది సమంత. సమంత చెప్పిన ఈ సీక్రెట్ అప్పట్లో తెగ వైరల్ అయిపోయింది.