పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకొన్న వారే కానీ మెచ్చుకొని వారు ఎవరూ ఉండరు. తాగడానికి నీళ్లు లేక ఇబ్బందిపడుతున్న ఎంతో మంది కోసం పవన్ కళ్యాణ్ మంచినీళ్ల బోర్ పంపులను వేయించాడు. మెగాస్టార్ తమ్ముడు అయినప్పటికీ సినిమాల్లో కూడా దర్శకులు చెప్పినట్టుగా వింటూ ఎంతో శ్రమపడి తన సినిమాని పూర్తి చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించి రెండు కోట్ల రూపాయలను ఆ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఈ సంస్థ ద్వారా పేదవారికి ఆర్థిక సాయం అందుతుంది.


బంగారం సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు... తన బిడ్డకు జబ్బు వచ్చిందని సహాయం చేయాలని ఒక దంపతులు అతనిని ఆశ్రయించగా... తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్ తన అసిస్టెంట్లను పిలిచి ఆ పిల్లోడిని రెయిన్ బౌ హాస్పిటల్ కి తరలించి... వైద్య ఖర్చులు అన్నీ తానే భరించాడు. ఖుషి సినిమా తీసిన అనంతరం పెప్సీ కూల్ డ్రింక్ సంస్థ కు అంబాసిడర్ గా కొన్నేళ్లుగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే కూల్ డ్రింక్ లో విషపూరితమైన కెమికల్స్ కలుస్తాయని తెలిసాయో ఆ క్షణమే ఆ సంస్థని ప్రచారం చేయడం మానివేసాడు. ఈ సంఘటన గురించి తెలుసుకుంటుంటే తనకు డబ్బుల మీద కంటే ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ ఉందని తెలుస్తుంది.


ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా... సాధారణమైన వస్త్రాలను మాత్రమే ధరించడం ఆయనలోని సింప్లిసిటీ ని ప్రతిబింబిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... ప్రజల కొరకై ఏకంగా రెండు కోట్ల రూపాయలు ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సినిమాలు ఏమీ చేయకపోయినా... తన వంతుగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని విషయాలను పక్కన పెట్టి చూస్తే... పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం గల ఒక మనిషి అని స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి జనసైనికులు పేదలకు అండగా నిలుస్తూ అందరి మన్నలను పొందుతూ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: