సిల్క్ స్మిత.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. తన నిషా కళ్ళతో నాలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులను కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది ఈ భామ.  తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం మరియు హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించి తానేంటో నిరూపించుకుంది. ఇక సిల్క్ స్మిత అస‌లు పేరు విజయలక్ష్మి. గ్లామర్ ప్రపంచంలో తనదైన‌ ముద్ర వేసి విజయం సాధించినా.. తన పేరులోని విజయం మాత్రం జీవితంలో చవిచూడలేకపోయింది. దీపం చుట్టూ శలభంలా తనకు తానే కాలి బూడిదయింది.

IHG

అయితే ఎన్నో సినిమాలలో తన అందచందాలతో, యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీనే. కొంతమంది, సినిమా నిర్మాణంలో పెద్ద మొత్తంలో పెట్టి నష్టపోయినందుకు స్మిత ఆత్మహత్య చేసుకొన్నారని భావిస్తారు. మరికొంతమంది స్మిత ప్రేమించి విఫలమైన కారణంగా సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారు. కానీ, కేవ‌లం 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత.. తెరపై కనిపించేదంతా అబద్దమని.. తన చావు మాత్రమే నిజమనే సంకేతాన్నిచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకుంది. 

IHG

అయితే ఆమె మ‌ర‌ణం వెన‌క సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్. కన్నడ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వీ రవిచంద్రన్. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరొందిన ఆయనకు సిల్క్ స్మితతో మంచి స్నేహం ఉండేది. ఇక 1992లో సిల్క్ స్మిత, రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో న‌టించ‌డంతో.. అప్పట్నుంచే వీళ్ల స్నేహం మ‌రింత బలపడింది.  తనతో చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని వీ రవిచంద్రన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆమె చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పాడు ఈ స్టార్ హీరో. 

IHG

ఆమె డిప్రెషన్ లో తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది వీలుపడలేదని గుర్తు చేసుకున్నాడు. తాను ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా సిల్క్ స్మిత నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అయితే ఏదో రొటీన్ కాల్ అని ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని.. లేకపోతే ఇంత దారుణం జరిగిఉండకపోయేదని ఆవేద‌‌న వ్య‌క్తం చేశారు. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందని.. కానీ తాను మాట్లాడలేకపోయానని.. ఆ తర్వాత రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని రవిచంద్రన్ కృంగిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: