హీరో కార్తికేయ దాదాపు అందరికీ గుర్తు వచ్చే ఏకైక సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాలో కార్తికేయ ఒక ప్రేమికుడిగా నటించి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత హిట్టు, ప్లాప్ అన్న సినిమాలు తేడా లేకుండా వరుసగా తనకు నచ్చిన క్యారెక్టర్ నచ్చితే ఆ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇలా ఉండగా తాజాగా కార్తికేయ తన రియల్ లవ్ స్టోరీ నీ తెలియజేశాడు. జీవితంలో కూడా సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ కాదని కార్తికేయ తెలియజేశారు.

 

తన లవ్ స్టోరీ గురించి తెలియజేస్తూ.. కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. అది ప్రేమో కాదో కూడా నాకు తెలియదు. చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం అప్పట్లో. అయితే కాలేజ్ ముగిసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయాం. ఆ తర్వాత నేను నటించిన సినిమాలు చూసి తాను మళ్ళీ రావడం జరిగింది. కానీ ప్రస్తుతం తనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఒకప్పటి ఫీలింగ్స్ లేవు. తను కేవలం ఒక స్నేహితురాలు గానే ఉంది అని కార్తికేయ తెలియజేశాడు. ప్రస్తుతానికి మాత్రం నేను ఎవరితో ప్రేమలో లేను, సింగల్ గానే ఉన్నాను అంటూ తెలిపాడు.

 

గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ క్యారెక్టర్ గా చేసిన కార్తికేయ.. హీరోగా నటించే అవకాశం లేదని అంటున్నాడు. మంచి పాత్ర ఏదైనా సరే నేను చేయడానికి రెడీ అంటున్నాడు కార్తికేయ.  ఇలాంటి ఒక మంచి పాత్ర దొరకడంతో అతి త్వరలోనే తమిళ్ లో ఒక సినిమా తీయబోతున్నట్లు కార్తికేయ తెలియజేశాడు. ఏది ఏమైనా ఈ క్రేజీ హీరోను మెప్పించే ముద్దుగుమ్మ ఎక్కడ పుట్టి పెరుగుతుందో. ఏది ఏమైనా కార్తికేయ తన నటనతో, మాటలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: