1987 ఏప్రిల్ 28వ తేదీన చెన్నై లో సమంత జన్మించింది. సమంత తండ్రి అచ్చ తెలుగు వారే. కానీ సమంత తాత తన తండ్రి వయసు లో ఉన్నపుడు మద్రాసు వెళ్లిపోవడంతో వారంతా అక్కడే సెటిల్ అయిపోయారు. సమంత తల్లి మలయాలి. కేరళలో జన్మించిన తన తల్లి ఆంగ్లో ఇండియన్. చిన్నప్పుడు సమంత చాలా కామ్ గా అలాగే చురుకుగా ఉండేదట. హోలీ ఎంజల్స్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ లో ఆమె తన స్కూలు చదువును పూర్తి చేసింది. ఇంటర్ నుండి స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్ చదివింది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం పై చదువులు చదివి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆస్ట్రేలియా దేశానికి వెళ్లేందుకు సిద్ధమై వీసా కోసం అప్లై చేసుకుంది.


అయితే వీసా లభించాలంటే ఒక సంవత్సరం పాటు వేచి ఉండాలని అధికారులు చెప్పగా... సామ్ ఏడాది పాటు ఖాళీ గా ఉండటం ఇష్టం లేక ఆ సమయంలో పాకెట్ మనీ సంపాదించాలని భావించింది. ఈ క్రమంలోనే తన స్నేహితుడు వెంకట్ రామ్ ద్వారా డెక్కన్ క్రానికల్ లో మోడలింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసుకుంది. ఆ తర్వాత చెన్నైలోని బట్టల షాపులకు మోడలింగ్ చేస్తూనే డబ్బులు బాగా సంపాదించింది. అప్పట్లో తమన్నా శ్రియ శరన్ లాంటి హీరోయిన్ల పక్కన తాను కూడా జూనియర్ మోడల్ గా ఉండేదట.


అలా సామ్ మోడలింగ్ జీవితాన్ని గడుపుతున్న సందర్భంలోనే... తన ఫోటోలని చూసిన దర్శకుడు రవివర్మ తన తదుపరి చిత్రమైన కావేరి సినిమాలో కథానాయకి ఆఫర్ ఇచ్చాడట. దాంతో బాగా సంబరపడిపోయిన సమంత తన తల్లిదండ్రులు ఎంత వద్దన్నా... బ్రతిమాలి మరీ కావేరి సినిమాలో నటించింది. 2007 ఆగస్టు నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా... ఏవో కొన్ని అనివార్య కారణాల వలన సినిమా పూర్తి అవకుండా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో సమంత మళ్ళీ మోడలింగ్ కెరీర్లో అడుగుపెట్టింది. కొద్దిరోజుల్లోనే తెలుగు దర్శకుడు గౌతమ్ మీనన్ సమంత మోడలింగ్ ఫోటోలను చూసి తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. వెంటనే సమంతాకి కబురు పంపించి తన ఆఫీస్ కు రావలసిందిగా కోరాడు. కానీ సమంతా మాత్రం ఆఫీస్ కు వెళ్లేందుకు నిరాకరించింది. గౌతమ్ మీనన్ ఆమెను రెండవసారి కూడా కావాలని కోరగా... తను మాత్రం వెళ్లలేదు.


దానికి కారణం గౌతమ్ మీనన్ అప్పటికే బెంగళూరు, ముంబై నగరాలకు చెందిన 200 మంది మోడల్స్ ని పిలిపించి రిజెక్ట్ చేశారు. 'అంతమంది మోడల్స్ నే రిజెక్ట్ చేశాడు... నన్ను రిజెక్ట్ చేయడని గ్యారెంటీ ఏముంది' అనుకుంటూ సమంత గౌతమ్ మీనన్ ఆఫీస్ కు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే ఒకరోజు సమంతా తన స్నేహితులతో కలిసి సమయం గడుపుతుండగా... గౌతమ్ మీనన్ నుండి మళ్ళీ ఇంకొకసారి ఫోన్ వచ్చింది. అప్పుడు కూడా తాను నో చెబుతుంటే... తన ఫ్రెండ్స్ అంతా కలిసే ఆమెకు గౌతమ్ మీనన్ చాలా గొప్ప దర్శకుడు అని చెప్పి... బలవంతంగా తనను గౌతమ్ మీనన్ ఆఫీస్ కి పంపించారు. అయితే అక్కడ గౌతంమీనన్ లేకపోవడంతో... ముందస్తుగానే ఆమె వస్తుందన్న సంగతి తెలిసిన అసిస్టెంట్లు ఆమెకు ఫోటోషూట్ నిర్వహించి తిరిగి పంపించేశారు.


గౌతమ్ మీనన్ ఆఫీస్ చేరుకొని సమంత ఫోటో షూట్ పరిశీలించి తన సినిమాకి హీరోయిన్ గా సామ్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆమెను సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆయనే ఫోన్ చేసి తెలపడంతో... ఖంగుతిన్న సమంత వెంటనే ఆఫీస్ కి వెళ్లి కన్ఫామ్ చేసుకుంది. ఆ తర్వాత సినిమా తెరకెక్కడం బ్లాక్ బాస్టర్ హిట్ కావడం, ఫస్ట్ సినిమాతోనే అగ్రతారగా సమంత మారిపోవడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ తన స్నేహితులే ఆమెను గౌతమ్ మీనన్ ఆఫీస్ కి వెళ్ళమని చెప్పకపోతే... సమంత వెళ్ళేది కాదేమో. ఏది ఏమైనా తన స్నేహితులకు ఆమె ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: