మాయ చేసావె చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత.. నిజంగానే మాయ చేసింది. వాస్త‌వానికి  కాలేజీ డేస్ తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి సామ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే కొంతమంది కొందరి కోసమే పుడతారంటారు. అలాగే కొన్ని పాత్రలు కొందరిని వరించడానికే జనిస్తాయి. అలా ‘జెస్సీ’ పాత్రకు సమంత కూడా అంతే అనాలి. ఈ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ఆ త‌ర్వాత ఎన్నో మంచి మంచి అవకాశాల‌ను ద‌క్కించుకుంది.  ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి.. త‌నదైన స్టైల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇప్పుడు సమంత అంటే ఓ బ్రాండ్‌. 

 

ఆమె సినిమాలో నటిస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఇక కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో కూడా అదరగొడుతున్నారు. అలాగే  నటనకు ప్రాధాన్యం ఉన్న చిన్న రోల్స్‌లో కూడా మెప్పించడం ఆమెకే చెల్లింది. అలాంటి స‌మంత అక్కినేని నేడు 33వ పుట్టిన రోజు జ‌రుపుకుంటుంది. చెన్నైలోని పల్లవరంలో 1987 ఏప్రిల్‌ 28న జన్మించింది సమంత. ఆమె తండ్రి తెలుగువారు కాగా, తల్లి మలయాళీ. హోలీ ఏంజిల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె స్టెల్లా మేరీస్‌ కాలేజీలో డిగ్రీ చదువుకుంది. 

 

ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. తెలుగింటి కోడలిగా మారారు. పైళ్లైనా తర్వాత నటనను కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే స‌మంత‌కు తమిళ స్టార్ హీరో సూర్య అంటే పిచ్చి ఇష్ట‌మ‌ట‌. చ‌దువుకునే రోజుల నుంచే సూర్య‌కు స‌మంత వీరాభిమాని అట. అయితే ఆయన ఒక వేడుక కోసం సమంత చదువుకుతున్న స్టెల్లా మేరీస్‌ కాలేజీకి రావడం చూసి ఒక అభిమానిగా ఎంతో సంతోషించారట. అలాంటి కథానాయకుడి సరసన నటించే అవకాశం అంటే కల నిజమైనట్టే కదా. సమంత ఆ కలని నిజం చేసుకుంది. ఇద్దరూ కలిసి అంజాన్‌, 24 చిత్రాల్లో నటించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: