పదేళ్ల క్రితం ‘ఏ మాయ చేశావే’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన సమంతలో చలాకీతనం, అందం, నటనలో పరిపక్వత, హావభావాలు పుష్కలం. సమంతలో ఉన్న ఈ టాలెంట్ ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేశాయి. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటోంది. సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది. చైతన్యతో లవ్ ఎఫైర్ ను కొన్నేళ్లపాటు బయటకు తెలీకుండా మెయిన్ టైన్ చేయడం నిజంగా విశేషమే. సమంత ఏం చేసినా సెన్సేషనే. సమంత ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో ఎంతోకొంత క్యూరియాసిటీ ఉండే ఆన్సర్స్ ఇస్తుంది.

IHG

 

మీకు బాగా ఇష్టమైనది ఏదంటే.. సెక్స్ అంటూ ధైర్యంగా చెప్పేసింది. ఓ హీరోతో లవ్ రిలేషన్ లో ఉన్నానని చెప్పడమే కాకుండా అతని పేరు ‘ఎన్’ తో స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చి సస్పెన్స్ రేపింది. ఆ సమయంలో అందరికీ హీరో నితిన్ పేరు ఆలోచనల్లోకి వచ్చింది కానీ.. నాగ చైతన్య పేరు ఊహలోకి కూడా రాలేదు. ఎన్నో గాసిప్స్ రౌండ్ అవుతున్న వేళ చైతూ ఇంటి బాల్కనీలో ఇద్దరూ సిగరెట్ కాలుస్తూ ఉన్న ఫోటోలు సెన్సేషన్ రేపాయి. ఓ ఇంటర్వ్యలో కుక్క పిల్లలను పెంచుకోవటం ఇష్టమేనా అంటే.. చైతూ ఉన్నాడుగా అంటూ కొంటె సమాధానం ఇచ్చింది.

IHG

 

అక్కినేని ఇంటి కోడలైనా తన సెల్ఫ్ ఐడెంటిటీని మాత్రం వదులుకోలేదు. ఫోటోషూట్స్ లో హాట్ పోజులిచ్చి సంచలనం రేపింది. రీసెంట్ గా లాకౌ డౌన్ సమయంలో కూడా చైతుతో కలిసి వాకింగ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో రౌండ్ అయ్యాయి. నటిగా గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సమంత కెరీర్లో అందరికంటే భిన్నంగా ఫ్లాపులెన్నో చూడాలి. ఎందుకంటే దాదాపు ఆమె చేసిన సినిమాలన్న హిట్లే కాబట్టి. ఓబేబి సినిమాతో గ్లామర్ పాత్రలే కాదు నటనలో తానెంత ఎత్తులో ఉందో ప్రూవ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: