దేశమంతా కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతుంది. గత నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.  ప్రభుత్వాలు ఆదుకుంటున్నా.. కొన్ని చోట్ల మాత్రం ఆకటితో అలమటిస్తున్నారు.. అలాంటి వారి కోసం స్వచ్ఛంద సంస్థలు, కొన్ని కార్పోరేట్ సంస్థల యజమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే సినీ కార్మికుల కోసం సెలబ్రెటీలు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తూ వారి కష్టాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పటికే రూ.30 కోట్లు విరాళం ఇచ్చారు.  

  

ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన వంతుగా సామాజిక సేవను వినూత్నంగా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోధుమ పిండి సంచుల్లో పేదల కోసం రూ. 15 వేలు పంపించాడని అంటున్నారు.  వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 23న ఢిల్లీలోని నిరుపేద ప్రాంతానికి ఓ ట్ర‌క్ వ‌చ్చి ఆగింది. ఆ వాహనం నిండా గోధుమ పిండితో కూడిన సంచులు ఉన్నాయి. అవ‌స‌ర‌మైన వారికి ఆ సంచుల‌ని పంపిణీ చేసేందుకు టీం సిద్ధ‌మ‌య్యారు. ఎక్కువ సమయంల నిలబడి ఆ సంచులు తీసుకునేందుకు చాలా మంది నిరాకరించారు. ఒకవేళ తీసుకున్నా గోదుమ పిండి తో పాటు ఏదీ లేదని నిరాశంతో కొంత మంది నిరాకరించారు. 

 

కానీ ప్యాకెట్ తీసుకున్న వారు ఇప్పుడు సంతోషంలో ఉన్నారు..ఆ ప్యాకెట్ లో రూ.15 వేలు ఉన్నాయి.   ఒక ప్యాకెట్ ఇవ్వడం ద్వారా ఎంతో అవసరం ఉన్న వారు తప్ప మరెవరూ తీసుకోరు. అందుకే ఈ ప్యాకెట్లలో డబ్బులు పంపిస్తే అవి అవసరమైనవారికి మాత్రమే చేరుతాయని ఈ కొత్త ప్లాన్ వేశారని అంటున్నారు. అయితే ఈ గోధుమ పిండి ప్యాకెట్ల‌ని పంచింది అమీర్ ఖాన్ అని జోరుగా ప్ర‌చారం అయితే వీటిని నిజంగానే అమీర్‌ ఖాన్ పంపించారా? లేదా అనేది తేలాలంటే.. ఆయనే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. మరోవైపు ఇవన్నీ రూమర్లే అంటూ ఖండిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: