టాలీవుడ్ లో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఆయన తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను వచ్చే ఏడాది విడుదల అవుతుంది. టాలీవుడ్ లో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిర్మాతగా ఈ సినిమాకు రామ్ చరణ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఈ సినిమా తర్వాత చిరంజీవి సినిమా చేస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. 

 

ఆయన ఇక హీరోగా సినిమాలు చేయవద్దు అని భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఆయనకు ఇప్పుడు డిమాండ్ ఉన్నా సరే ఆయన మాత్రం సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయనకు క్రేజ్ ఉన్నా సరే ఇక వయసు మీద పడుతుందని హీరో గా చేస్తే అంత బాగుండదు అని సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. లేదా తన వయసు కి తగిన పాత్రలను చెయ్యాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. వయసు కి తగిన పాత్రలకు సంబంధించి కథలు ఉంటే సిద్దం చెయ్యాలి అని కూడా కోరినట్టు సమాచారం 

 

ఆయన ఈ సినిమా తర్వాత లూసిఫర్ అనే సినిమా చేస్తారు అని భావించారు. కాని ఆయన మాత్రం తాను చేసేది లేదని చెప్పినట్టు సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది కూడా అర్ధం కావడం లేదు. ఆ సినిమా వేరే భాష లో మంచి విజయం సాధించింది మరి ఇక్కడ ఆయన చేస్తాను అని కూడా చేయను అనడానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: