బాలీవుడ్ లో అందరికీ తెలిసిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఆయన చేసే విలక్షణ పాత్రలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతతో ముంబైలోని కోకిలాబెన్  ధీరుభాయి అంబానీ హాస్పిటల్లో చేరారు. అయితే ఇర్ఫాన్ అనారోగ్యం గురించి సమాచారం అధికారంగా ఇంకా వెలువడాల్సి ఉంది. కాకపోతే ఇర్ఫాన్ ఖాన్ తల్లి రెండు రోజుల క్రితమే అనగా ఆదివారం ఉదయం జైపూర్ లో మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక తాజాగా ఇర్ఫాన్ ఖాన్ హాస్పటల్ లో చేరడం పై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే....

 


ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఇర్ఫాన్ ఖాన్ కాస్త మనస్థాపానికి గురి అయ్యారని చెప్పవచ్చు. దీనికి కారణం ఆదివారం నాడు తన తల్లి అంత్యక్రియలకు హాజరు కాకవడంతో మరింత విచారంగా మారాడు ఆయన. కేవలం వీడియో కాలింగ్ ద్వారా తల్లి అంతక్రియలు ఆయన పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. తన తల్లి మరణవార్తతో ఇర్ఫాన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీనికి కారణం అందరికీ తెలిసినట్టుగానే గత రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బంది పడుతున్నది తెలిసినదే. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో అతను బాధపడుతున్నాడు. దీనికోసం ఆయన లండన్ లోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కొన్ని నెలల చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది, అయితే ఆ తర్వాత మళ్లీ ఆయన సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.

 

ఇక ఆయన కెరీర్ చూస్తే ఆయనకు ఒక భార్య సుతాపా సిక్దర్, బాబిల్, ఆయాన్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో చేరిన తర్వాత ఆయనకు తోడుగా హాస్పిటల్లోనే వారందరూ ఉంటున్నారు. జైపూర్లోని టోంక్ నవాబు వంశానికి చెందిన ఇర్ఫాన్ ఖాన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో శిక్షణ పొంది ఆ తరువాత చాలా టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు. ఆ తరువాత బాలీవుడ్ లోకి వచ్చాక అనేక సినిమాలలో తన నటన ఏమిటో చూపించి మంచి మార్కులు కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: