సినిమాల్లో సక్సెస్ రావటం వేరు.. సక్సెస్ లను నిలబెట్టుకోవడం వేరు. మంచి నటులు, టెక్నీషియన్, తెలివితేటలున్న వ్యక్తి.. ఇలాంటివి ఏమీ ఇక్కడ పనికి రావు. కేవలం సక్సెస్ లు మాత్రమే మాట్లాడే అరుదైన ఇండస్ట్రీ ఇది. వెన్నెల, ప్రస్థానం వంటి సినిమాలతో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవ్ కట్టా పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. మంచి చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా ఒకే ఒక్క ఫ్లాప్ ఆయన్ను వెనక్కు నెట్టేసింది. ఇందుకు కారణం కొందరు నిర్మాతలే కారణమంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని వార్తలు రౌండ్ అవుతున్నాయి.

 

 

ప్రస్థానం సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు దేవ్ కట్టా. నాగ చైతన్య, సమంత జంటగా వచ్చిన ఆటోనగర్ సూర్య సినిమా ఆయన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. తన మొదటి, రెండో సినిమాల బడ్జెట్ తన పరిధిలోనే ఉందని తర్వాతి సినిమాలు తన పరిధిలో లేకపోయిందని వాపోతున్నాడట. ఫలితంగా ఆటోనగర్ సూర్య అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని.. ఈ పరిస్థితులు సినిమా రిలీజ్ పైనే కాకుండా ఫలితంపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నాడట. దేవ్ కట్టాకు కమర్షియల్ సక్సెస్ దక్కకపోయినా అవకాశాలు వచ్చాయి.

 

 

ప్రస్థానం సినిమాను హిందీలో సంజయ్ దత్ తోనూ తెరకెక్కించాడు. కానీ.. అక్కడ ఫ్లాప్ అయింది. కానీ.. దేవ్ కట్టాలో టాలెంట్ పుష్కలంగా ఉంది. బాహుబలి బిగినింగ్ లో క్లైమాక్స్ లో ప్రభాస్ చెప్పే డైలాగుల్ని దేవ్ కట్టా చెప్పిన పాయింట్ల ఆధారంగానే పెట్టుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజమౌళి. టైటిల్ కార్డ్స్ లో దేవ్ కట్టాకు థాంక్స్ కార్డ్ కూడా వేశాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ఓ పొలిటికల్ టచ్ ఉన్న సినిమా చేస్తున్నాడు. దీంతోనైనా హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: