టాలీవుడ్ లో అగ్ర దర్శకుడి గా ఒక వెలుగు వెలిగిన దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమాలు అనగానే కమర్షియల్ గా ఉంటాయి అనే విషయ౦ అనే అందరికి తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తూ ఉంటారు. అగ్ర దర్శకుడు ఆయన అవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. చిన్న చిన్న హీరోలతో ఆయన ముందు నుంచి కూడా సినిమాలు చేయలేదు అనే సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ లో చేసిన సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే విజయం సాధించాయి. దీనితో అగ్ర దర్శకులు కూడా ఆయన్ను అందుకోలేకపోయారు. 

 

ప్రస్తతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేతాడు అనేది ఎవరికి స్పష్టత రావాడ లేదు. ఆయన తో సినిమా చేయడానికి గానూ స్టార్ హీరోలు అందరూ కూడా పోటీ పడుతున్నారు. ఆయన చిరంజీవి తో చేస్తున్న సినిమా అయిన తర్వాత తన తో సినిమా చెయ్యాలని ప్రభాస్ అడిగినట్టు సమాచారం. ప్రభాస్ తో ఆయన చేసిన మిర్చీ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 

అందుకే కొరటాల తో ప్రభాస్ మళ్ళీ సినిమా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ ఇప్పటికే కొరటాల కు ఫోన్ చేసి తన తో సినిమా చెయ్యాలి అని అడిగాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా పూర్తి అయ్యే సరికి హీరోలు ఎవరూ కూడా ఖాళీ గా ఉండరు. ప్రభాస్ సినిమా మాత్రమే పూర్తి అయి అతను రెడీ గా ఉంటాడు. అందుకే ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి చేస్తాడో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: