తెలుగు సినిమాలు అనగానే చాలా మందికి కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏ సినిమా అయినా సరే ఫ్యామిలీ టచ్ లేకుండా ఉండే అవకాశం ఉండదు. ఈ సినిమాలు మన తెలుగులో బాగానే ప్రేక్షక ఆదరణ సాధించాయి అనే విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో చిన్న హీరోలు సైతం ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఫ్యామిలీ టచ్ లేకుండా సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 

 

అగ్ర హీరోలు కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు ప్రస్తుతం తెలుగులో. ఫ్యామిలీ లేకుండా సినిమా చేస్తే మంచి విజయం సాధించే అవకాశం ఉందనే భావనలో ఉన్నారట. అగ్ర హీరోలు అయినా  చిన్న హీరోలు అయినా సరే ఇదే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మన తెలుగులో వచ్చే సినిమాలకు సంబంధించి దర్శక నిర్మాతలు కూడా ఇవే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు అని అంటున్నారు. దీని తో సినిమా కమర్షియల్ గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. 

 

ప్రస్తుతం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమాలో ఫ్యామిలీ గోల వద్దని చెప్పినట్టు సమాచారం. వేరే గా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గాని హీరో కి ఫ్యామిలీ కి లింక్ పెట్టవద్దు అని కోరుతున్నారని అంటున్నారు. అయితే దీనికి బలమైన కారణం మరొకటి ఉంది అని అంటున్నారు. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తండ్రి చనిపోతారు. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ తండ్రి చనిపోయారు. ఆ తర్వాత అతని తండ్రి హరికృష్ణ కూడా మరణించారు. అందుకే వద్దని చెప్పినట్టు సమాచారం. ఇక తాను ఫ్యామిలీ ఉంటే సినిమాలు చేసేది లేదు అని చెప్పినట్టు సమాచారం. అందుకే కథలో త్రివిక్రమ్ మార్పు చేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: