టాలీవుడ్ లో కరోనా సెట్స్ గురించి చర్చ నడుస్తోంది. అలాగనీ.. కరోనా వైరస్ ను సెట్ వేసి.. అందులో సీన్స్ గానీ.. సాంగ్స్ గానీ తీయడం లేదు. కరోనా కారణంగా నష్టపోయిన దర్శక, నిర్మాతలు ముంబై స్లమ్ ఏరియాను.. జార్జియా వీధులను హైదరాబాద్ లో తిరిగి ప్రతిష్టించనున్నారు. 

 

కరోనా నుంచి ప్రపంచం బయట పడినా.. సినిమా ఇండస్ట్రీ మాత్రం చివరిలో కోలుకుంటుంది. దీనికి మూడు నెలలు పడుతుందా.. ఆరు నెలలు పడుతుందా అని చెప్పలేకపోతున్నారు. షూటింగ్స్ మొదలైనా.. క్రౌడ్ ఎక్కువగా ఉండే సీన్స్ చిత్రీకరించేందుకు అనమతి ఉండకపోవచ్చు. ఒకరిద్దరు, ముగ్గురు ఉండే సీన్స్ ను ముందుగా తీస్తారు. కథలో ఫారిన్ భాగం అయినా.. ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో తీయాల్సి వస్తే.. అక్కడికి వెళ్లే రిస్క్ చేయకుండా.. హైదరాబాద్ లోనే సెట్స్ వేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 

 

విజయ్ దేవరకొండ అండ్ పూరీ జగన్నాథ్ టీమ్ హైదరాబాద్ కు మకాం మార్చేస్తోంది. హీరోహీరోయిన్లు విజయ్, అనన్య పాండే పాల్గొనగా కొన్ని సీన్స్ తో పాటు మరిన్ని సన్నివేశాలను 40రోజుల పాటు ముంబైలో చిత్రీకరించాడు పూరీ. మరికొన్ని సీన్స్ అక్కడే తీయాల్సి ఉంది. కరోనా ఇండియాలో ఎక్కువగా ముంబై మహానగరంలో వ్యాపించింది. ముంబై కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని.. అక్కడ చిత్రీకరణ అంత సేఫ్ కాదని పూరీ భావిస్తున్నాడట. మరి అక్కడ చిత్రీకరించాల్సిన బ్యాలెన్స్ సీన్స్ ను హైదరాబాద్ లో సెట్ వేసి తీయాలా.. లేదంటే షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ముంబై వెళ్లి తీయాలా.. అనే ఆలోచనలో ఉంది పూరీ టీమ్. 

 

ఇదే సమస్య ప్రభాస్ ను వెంటాడుతోంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఏడాది క్రితం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలైంది. ఈ మూవీ ఆ మధ్య జార్జియా వెళ్లొచ్చింది. కరోనా కారణంగా షూటింగ్ సగంలోనే ఆపేసి ఇండియా తిరిగొచ్చేసింది చిత్ర యూనిట్. మళ్లీ ఫారిన్ వెళ్లి షూటింగ్ అంటే.. పర్మీషన్స్ అంత తొందరగా రావు. వచ్చినా యూరోపియన్ కంట్రీస్ కు వెళ్లి షూటింగ్ అంటే.. నటీనటుల్లో టెక్నీషియన్స్ భయం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: