నిజానికి టాలీవుడ్ లో అందాల తార శ్రీదేవితో అధిక చిత్రాల్లో నటించింది కృష్ణ తోనే. కృష్ణ కుటుంబానికి శ్రీదేవికి చాలా దగ్గర సాన్నిహిత్యం ఉందంట. అయితే కృష్ణ, శ్రీదేవి వీరిద్దరూ కలసి దాదాపుగా 31 చిత్రాల్లో నటించడం విశేషం. శ్రీదేవి - కృష్ణ కలసి నటించిన తొలి చిత్రం బుర్రిపాలెం బుల్లోడు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో దాదాపుగా 350కి పైగా సినిమాలలో నటించారు. అయితే అందులో సాంఘికం, జానపదం, పౌరాణికం, కౌబాయ్, జేమ్స్ బాండ్ సహా దాదాపుగా అన్ని రకాల పాత్రలను పోషించిన కృష్ణ, తన సినిమా కెరీర్ లో అత్యధికంగా సతీమణి విజయ నిర్మలతో పాటు ఏకంగా 45 సినిమాల్లో హీరోగా నటించగా, ఆ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవితోనే కలిసి 31 సినిమాలో నటించిన కృష్ణ, అందులో చాలా వరకు విజయాలను అందుకున్నారు. నిజానికి ఇక అప్పట్లో వారిద్దరి జోడి ఒక సూపర్ హిట్ పెయిర్ గా మంచి పేరు పొందారు.

 

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో  ఏదైనా సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడులలో కూడా విపరీతమైన అంచనాలు ఉండేవట. ఇక అప్పట్లో యువత అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే పాటల కోసం ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన హిట్ సినిమాలు కలవారి సంసారం, వయ్యారి భామలు వగలమారి భర్తలు, వజ్రాయుధం, ఖైదీ రుద్రయ్య, కృష్ణావతారం ముందడుగు, రామరాజ్యంలో భీమరాజు, షంషేర్ శంకర్, బంగారు కొడుకు, ఊరంతా సంక్రాంతి, అడవి సింహాలు, బంగారు భూమి, మకుటం లేని మహారాజు, చుట్టాలున్నారు జాగ్రత్త ఇంకా మరిన్ని సినిమాలు ఉన్నాయి.

 

నిజానికి హీరో కృష్ణతో పోల్చుకుంటే వయసులో చాలా చిన్నదైన శ్రీదేవి తనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడం, అలాగే వాటిలో చాలా వరకు కూడా సూపర్ సక్సెస్ సాధించి అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసారు. అయితే నిజానికి కృష్ణ కుటుంబంతో శ్రీదేవికి చిన్ననాటి నుంచే మంచి సాన్నిహిత్యం ఉంది. ఇంతక ముందు చెన్నైలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. అయితే ఇటీవల శ్రీదేవి మరణ సమయంలో ఆమెతో కలిసి నటించిన సినిమాల విషయాన్ని గుర్తు చేసుకున్న కృష్ణ, తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటిని కోల్పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కృష్ణ తెలిపారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: