క‌న్న‌డ బ్యూటి ర‌ష్మిక మందన్న‌కు కాస్త‌ అల్ల‌రి ఎక్కువే. ఎక్క‌డ వున్నా త‌న అల్ల‌రి మాట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డం ర‌ష్మిక ప్ర‌త్యేక‌తఅట‌. `ఛ‌లో` సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ‌. ఆ త‌రువాత వ‌రుస‌గా గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి చిత్రాల్లో న‌టించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో సుకుమార్ ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది.

 

ఇందు కోసం ప్ర‌త్యేకంగా చిత్తూరు యాస‌లో మాట్లాడ‌టానికి ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ కూడా నేర్చుకుంది. లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్ ఎప్పుడు మొద‌లైతే అప్పుడు షూటింగ్‌లో పాల్గొన‌డానికి ర‌ష్మిక సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా ప్ర‌భావం ఎప్పుడైతే మొద‌లైందో అప్ప‌టి  నుంచి ఇంటికే ప‌రిమిత‌మైన ర‌ష్మిక స‌ర‌దాగా మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులతో ముచ్చ‌టించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కాస్త‌ కొంటెగా స‌మాధానాలు చెప్పింది. ఇక బ‌య‌ట మీడియాతో మాట్లాడేట‌ప్పుడు కూడా ర‌ష్మిక క్యారెక్ట‌ర్ దాదాపు స‌రిలేరునీకెవ్వ‌రు లానే ఉంటుంది.

 

లాక్‌డౌన్ ఎత్తేశాక త‌న స్నేహితుల్ని క‌లుస్తాన‌ని చెప్పింది. ఇక `దిల్ వాలే దుల్హ‌నియా లేజాయేంగే`లో షారుఖ్, కాజ‌ల్ త‌ర‌హాలో మీరు నాతో డేటింగ్‌కి వ‌స్తారా అని ఓ అభిమాని అడిగితే న‌న్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అంది. దేవుడు నాకు ఎదురైనా న‌న్ను నీ భ‌ర్త‌ని చేయ‌మ‌ని అడుగుతా అని ఓ అభిమాని ప్ర‌శ్నస్తే మాత్రం అత‌డికి కొంటెగా దిమ్మ‌దిరిగే ఆన్స‌ర్ ఇచ్చింది. `ద‌యచేసి ముందు త‌న కుక్క అనుమ‌తి తీసుకోమ‌ని షాకిచ్చింది. దీంతో నెటిజ‌న్స్ అంతా ర‌ష్మిక‌ని పెళ్లాడాలంటే ఆమె పెంపుడు కుక్క అనుమ‌తి తీసుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు. మ‌రికొంత మంది మ‌రీ ఇంత ఘాటుగా స్పందించిందేమిటంటూ కాస్త ఫీల‌య్యేవాళ్ళు ఫీల్ కూడా అవుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: