టాలీవుడ్ లో చిరంజీవి - విజయశాంతి కలిసి చాలా సినిమాలు చేశారు. నిజానికి క్లాస్ కే కాదు మాస్ సినిమాలకు కూడా చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా " మెకానిక్ అల్లుడు ". ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా అనంతరం చిరు - విజయశాంతి కాంబినేషన్ లో ఏ సినిమా కూడా రూపుదిద్దు లేదు. 

 

అలాగే విజయశాంతి " ఒసేయ్ రాములమ్మ " లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును వచ్చింది. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోని ఎక్కువ శాతం నటిస్తూ వచ్చింది.  ఇక చిరు - విజయశాంతి కాంబినేషన్ లో దాదాపు 19 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.  చిరు - విజయశాంతి జంటగా మొదట సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పేరు " సంఘర్షణ ". అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అలాగే ఆ తర్వాత దేవాంతకుడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.

 

ఇక కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఛాలెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక క్రేజీ డైరెక్టర్ కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు విజయశాంతి, రాధ లు కలిసి నటించిన సినిమా కొండవీటి రాజా. ఈ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక వీరిద్దరి జంటగా బ్లాక్ బాస్టర్ హిస్టరీ సాధించిన " పసివాడి ప్రాణం " సినిమా వీరిద్దరి కెరియర్లో మరిచిపోలేని సినిమా అనే చెప్పాలి. చిరు ఈ సినిమాతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో కూడా అయ్యాడు. 

 

ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాకు చిరుకి ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక చివరగా నటించిన మెకానిక్ అల్లుడు బ్లాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. అయితే అప్పట్లో ఆ సినిమాని అల్లు అరవింద్ తెరకెక్కించారు. ఆ తర్వాత వీరిద్దరి జంట ముందుకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: