సోషల్ మీడియాలో స్టార్స్ ఇప్పుడు చాల అందుబాటులో ఉంటున్నారు. తమ రెగ్యులర్ అప్డేట్స్ తో పాటుగా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాటింగ్ లు గట్రా చేస్తున్నారు. ఈ విషయంలో హీరోల కన్నా హీరోయిన్స్ ముందువరుసలో ఉన్నారు. ఇక లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ రష్మిక లైవ్ చాట్ చేసింది. అందులో ఆమెని కొన్ని విచిత్రమైన ప్రశ్నలను అడిగారు ఆమె ఫ్యాన్స్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వ్యాయామం వదలమని చెబుతుంది రష్మిక. వంట ఏమాత్రం వచ్చన్న మరో అభిమాని ప్రశ్నకు కేకులు, సీట్స్ చేస్తా అని సమాధానం ఇచ్చింది. 

 

మేము చూస్తున్నట్టుగా మీరు కూడా మీ సినిమాలు చూస్తారా అంటే తాను ఎక్కువగా టివి చూడనని.. ఇంట్లో చోసుకోవాల్సినవి చాలా ఉన్నాయని పెట్స్ ను గురించి చెప్పింది రష్మిక. పుష్ప కోసం కొత్త యాస నేర్చుకుంటున్నారట కదా అని అడగ్గానే అవును అది మీకెలా తెలిసింది అంటూ ఫ్యాన్ కె షాక్ ఇచ్చింది రష్మిక. ఇక ఒక వీరాభిమాని అయితే దేవుడు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దేవుడు కాదు ముందు ఇతని అనుమతి ఉండాలంటూ తన పెంపుడు కుక్క ఫోటోని పెట్టింది రష్మిక. వరుస సినిమాలతో తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్న ఈ అమ్మడు ఫ్యాన్స్ తో చాట్ లో కూడా తన చలాకీతనం చూపించింది. 


ఈ ఇయర్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. పుష్పలో తాను హీరోయిన్ కాదంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదని ఆమె ఈ చిట్ చాట్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో రష్మికనే తీసుకోవాలని చూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: