కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది.. మొదట 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ దాన్ని మరో 19 రోజులు పొడిగించారు.  దీనితో లాక్ డౌన్ టైం లో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ సెలబ్రిటీస్ కూడా తాము ఇంట్లో చేసుకునే పనులను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక అందరికన్నా వెరైటీగా ఈ లాక్ డౌన్ టైం లో షార్ట్ ఫిల్మ్ చేసింది కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆడ్రియా. షార్ట్ ఫిల్మ్ టైటిల్ కూడా లాక్ డౌన్ అని ఫిక్స్ చేశారు. ఆదవ్ కన్నదాశవ్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫీల్ లో ఆడ్రియా నాయించింది. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఈ షార్ట్ ఫిల్మ్ తీశారని తెలుస్తుంది. 

 

ఈ షార్ట్ ఫిల్మ్ ను ఐఫోన్ లో తీశారట. డైరక్టర్ వీడియో కాల్ ద్వారా సీన్ వివరిస్తే ఆడ్రియా తన ఇంట్లో ఉండే ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడం జరిగింది. హాఫ్ డే లోనే ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ కంప్లీట్ అయ్యిందని చెబుతుంది ఆండ్రియా. ఆదవ్ తనకు రెండేళ్లుగా తెలుసు అతనీలో చాల టాలెంట్ ఉంది. షార్ట్ ఫిలిం ఐడియా తనకు నచ్చడంతో వెంటనే చేసేద్దామని అన్నాను. ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని అన్నారు ఆడ్రియా. కొత్తగా ఆలోచించే వాళ్లకు ఈ షార్ట్ ఫిల్మ్ ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. 

 

లాక్ డౌన్ టైం లో మనిషి మానసిక స్థితి..?  అతను ఎలా ఆలోచిస్తున్నాడు..? అతని ప్రవర్తన ఎలా ఉంది..? అన్నదే ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ అని అంటున్నారు. చేయాలనే ఆలోచన ఉండాలే కానీ ఇంట్లో ఉన్నా షార్ట్ ఫిల్మ్ ఏంటి సినిమానే చేసే సత్తా ఉంది మన వాళ్లకు. మరి ఈ లాక్ డౌన్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది. ఆడ్రియా చెబుతున్నంత సీన్ ఈ షార్ట్ ఫిల్మ్ కు ఉందా లేదా అన్నది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: