బాలీవుడ్ మోగాస్టార్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌కు బెస్ట్ జోడి అనిపించుకున్న బ్యూటీ రేఖ. 70లలో ఈ ఇద్దరి ఆన్‌ స్క్రీన్ పెయిర్ మాత్రమే కాదు ఆఫ్‌ స్క్రీన్ పెయిర్‌ కూడా ది బెస్ట్ అనిపించుకుంది. వీరిద్దరికి సంబంధించిన రూమర్స్ అప్పట్లో ఓ రేంజ్‌లో సర్క్యులేట్‌ అయ్యాయి. తొలిసారిగా అమితాబ్, రేఖలు దో అంజానే అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తరువాత ప్రముఖ నిర్మాత యష్ చోప్రా నిర్మించిన సిల్ సిలా సినిమా ఈ జంటకు బెస్ట్ జోడిగా పేరు తెచ్చిపెట్టింది.

 

అమితాబ్ తొలిసారిగా కలిసి నటించటం విషయంలో రేఖ తన అనుభవాలను మీడియాతో పెంచుకుంది. ముందుగా దో అంజానే సినిమా కోసం  రేఖ ను తీసుకున్నారు. తరువాత అమితాబ్ ఆ ప్రాజెక్ట్ ఓకే చెప్పారు. అయితే ఈ సమయంలో రేఖ, అమితాబ్‌తో కలిసి నటించటంపై కాస్త భయపడింది.  దివార్‌ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బిగ్ బీ నటిస్తున్న సినిమా కావటంతో ఆమె కాస్త భయపడిందట. కానీ షూటింగ్ ప్రారంభమైన తరువాత అమితాబ్ నుంచి చాలా నేర్చుకునే అవకాశం కలిగిందని చెప్పింది రేఖ. అదే సమయంలో వీరిద్దరి  మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడంది.

 

అయితే వీరిద్దరి విషయంలో ఎన్ని రూమర్స్ వచ్చిన అమితాబ్, రేఖలు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అయితే వీరి బ్రేకప్ తరువాత ఓ ఇంటర్య్వూలో వీరి రిలేషన్‌ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీరు అమితాబ్ తో ప్రేమలో పడ్డారా అని ప్రశ్నించగా రేఖ ఏ మాత్రం తడుముకోకుండా అవును అంటూ సమాధానం చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. అయితే ఆమె ఆ ప్రశ్నను జనరలైజ్‌ చేస్తూ అమితాబ్‌ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు అంటూ చెప్పింది.

 

అయితే అదే సమయంలో నాకు అమితాబ్‌తో పర్సనల్ రిలేషన్‌ ఎప్పుడూ లేదు. అది నిజం. నేను అమితాబ్ ను ప్రేమించలేదని అబద్ధం చెప్పను కానీ. అందరిలాగే నేను కూడా ఆయన్ను ఆరాధించాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది రేఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: