మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డ లేని ఉత్సాహం ఉల్లాసం వ‌స్తుంది. అందులో చిరంజీవి రాధ కాంబినేష‌న్ అంటే ఇంక అస‌లు చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి సినిమాల‌న్నీ దాదాపు హిట్ అని చెప్పాలి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలు రికార్డు స్థాయి విజ‌యాల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా… కొత్త రికార్డుల‌ను నెల‌కొల్పాయి. అలా… నైజాంలో రూ.కోటి వ‌సూళ్ళు చేసిన తొలి తెలుగు చిత్రంగా `స్టేట్ రౌడీ` అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అని చెప్పాలి. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డితో పాటు పి.శ‌శిభూష‌ణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా రాధ‌, భానుప్రియ న‌టించిన ఈ చిత్రంలో శార‌ద‌, రావుగోపాల రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, త్యాగ‌రాజ‌న్‌, నూత‌న్ ప్ర‌సాద్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లో న‌టించారు. 

 

బ‌ప్పీలహ‌రి స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా `రాధ రాధ‌`, `వ‌న్ టూ త్రీ`, `చుక్క‌ల ప‌ల్ల‌కిలో`, `త‌థిగ‌ణ‌తోం` పాట‌లు అప్ప‌ట్లో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించాయ‌ని చెప్పాలి.  1989 మార్చి 23న విడుద‌లైన స్టేట్ రౌడీ. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దాదాపు చిత్రాల‌న్నీ కూడా హిట్ అని చెప్పాలి. తెర మీదే కాదు వీరిద్ద‌రి కాంబినేష‌న్ బ‌య‌ట చూడ‌టానికి కూడా చాలా మంది తెలుగు ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాల లిస్ట్ ఒక‌సారి చూద్దాం. ర‌క్త‌సింధురం, రాక్ష‌సుడు, కొండ‌వీటిదొంగ‌, మ‌ర‌ణ‌మృదంగం, జ్వాలా, లంకేశ్వ‌రుడు, య‌ముడికి మొగుడు, జేబుదొంగ‌, పులి, గుండా, కొండ‌వీటిదొంగ ఇలా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నీ కూడా ఫుల్ హిట్ అయ్యాయి. 

 

అంతేకాక చిరంజీవి ఎంతో మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించిన‌ప్ప‌టికి రాధ‌తో క‌లిసి చేయడం మాత్రం సూప‌ర్ కాంబినేష‌న్ అని చెప్పాలి. ఇక డ్యాన్స్ విష‌యంలో కూడా చిరంజీవి కంటే ఫాస్ట్ ఉండే హీరోయిన్ ఎవ‌ర‌న్నా ఉన్నారంటే అది రాధ అని చెప్పాలి. డాన్స్ అంటేనే ముందు గుర్తు వ‌చ్చేది చిరంజీవి. అయితే అలాంటి చిరు కంటే కూడా ఫాస్ట్‌గా డాన్స్ చేస్త‌ద‌ట రాధ‌. చిరంజీవి సెట్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్టుండ‌గానే రాధ ఆ స్టెప్పులు వేసి చూపించేసేద‌ట‌. అంత ఫాస్ట్‌గా ఉండేదంట డాన్స్ విష‌యంలో చిరంజీవితో పోటాపోటీగా డ్యాన్స్ చేసేది రాధ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: