తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే హీరోలు హీరోయిన్లు అన్న తర్వాత చాలా మంది తో నటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా హీరోలు ఎంతో మంది హీరోలతో నటిస్తూ ఉంటారు. అయితే ఎంతమంది హీరోయిన్లతో నటించినప్పటికీ కొంతమంది హీరోయిన్లు మాత్రం హీరోలకు పర్ఫెక్ట్ జోడి అని ప్రేక్షకులు అనుకుంటారు. ప్రేక్షకులు నచ్చి మెచ్చిన జోడి లలో ఎన్ని సినిమాలు వచ్చినా మంచి ఆదరణ చూపిస్తూ ఉంటారు. ఇలా చిరంజీవి కెరీర్ మొదట్లో చిరంజీవికి బెస్ట్  జోడి  అనిపించుకున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి. వీరిలో అభిమానులకు ఎక్కువగా గుర్తుండే జోడి రాధిక చిరంజీవి జోడి. 

 

 

 ఇద్దరి జోడి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఇద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటించారంటే  చాలు ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ అంతలా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది మరి. ఈ ఇద్దరి కాంబినేషన్లో డజనుకు పైగా నే సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. అందుకేనేమో ఈ జోడి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అంతేకాదు ఈ రీల్ లైఫ్ జోడి రియల్ లైఫ్లో కూడా జోడి అయితే ఎంత బాగుండు అని అనుకొని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి లేదు. 

 

 

 ముఖ్యంగా చిరంజీవి రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో  ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో దొంగ మొగుడు, పల్లెటూరి మొగుడు, గూడచారి నెంబర్ 1, రాజా విక్రమార్క, జ్వాల, అభిలాష లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఈ  ఇద్దరి కాంబినేషన్లో వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్లో రావడంతో రాధిక చిరంజీవి జోడి ప్రేక్షకులందరికీ ఫేవరేట్ గా మారిపోయింది. ఇంకేముంది ప్రేక్షకులందరూ ఇద్దరిని రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ కూడా జోడి గా చూడాలి అని అనుకున్నప్పటికి అది కలగానే మిగిలిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: