IHG's why | 123telugu.com

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ రాసి ఖన్నా.రాశి ఖన్నా కెరీర్ మొదటి నుంచి ఒక హిట్... రెండు మూడు ప్లాపులు అన్న చందంగా ఆమె కెరియర్ కొనసాగుతోంది. ఈమెకు మంచి స్టార్ డమ్ వచ్చింది అనుకునేలోపే ప్లాపుల రూపంలో ఈమె కెరీర్ నాలుగడుగులు వెనక్కి లాగుతూ  ఉండటం విశేషం. ఈమె నటించిన' వెంకీ మామ' మరియు 'ప్రతి రోజు పండగే' హిట్ కొట్టడంతో ఈమె దశ తిరిగింది అనుకున్నారంతా.  అయితే ఈ సినిమాల జోష్ తో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా లో అందాల ఆరబోతకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఊహించని రీతిలో సినిమా డిజాస్టర్ కు తెర లేపడం తో ఓ ప్లాప్ ని మూటగట్టుకుంది.

IHG

 వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఈ అమ్మడు మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ అమ్మడు చాలా బోల్డ్ గా కనిపించడం అభిమానులకు ఆసక్తి రేపిన ప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో చాలాచోట్ల విజయ్ దేవరకొండ తో ఈ అమ్మడు ముద్దు సీన్లలో పాల్గొంది మరియు అభిమానులకు హీట్ పుట్టించింది కూడా ఈ సీన్ లలో.ఈ విషయమై ఈ అమ్మడును  అభిమానులు మరియు  నెటిజన్స్  ట్రోల్  చేస్తున్నారు. ఈ సినిమా లో ఇంత బోల్డ్ గా యాక్ట్ చేయడం అవసరమా... హోమ్లీ క్యారెక్టర్స్ చేసుకుంటే నీ సొమ్మేం పోతుంది అని నెటిజెన్స్ సలహాలు మీద సలహాలు ఇస్తున్నారు.

IHG'World Famous Lover' A Valentine's Day <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GIFT' target='_blank' title='gift-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>gift</a> From ...

 

ఖంగుతిన్న రాశి ఖన్నా ఆమె సన్నిహితులతో మరియు ఫ్రెండ్స్ తో ఇకమీదట అటువంటి సినిమాలు చేయను అని పశ్చాత్తాపంతో చెప్పిందట. ఇకపై  బోల్డ్ క్యారెక్టర్ల కి దూరంగా ఉంటానని నమ్మ పలికిందట. అలాంటి క్యారెక్టర్లు చేసి అభిమానుల చేత మాటలు పడుతూ ఉండటం ఆమెను ఇబ్బంది పెట్టినట్లు వా పోయిందట.నెటిజన్స్ మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అంటూ సలహాల మీద సలహాలు ఇస్తున్నారట ...

మరింత సమాచారం తెలుసుకోండి: