నటీనటులకు సినిమా తీసుకొచ్చే గుర్తింపు ఎలాంటిదో తెలిసిన విషయమే. ఎక్కడికెళ్లినా ఫోటోలు, ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలతో అభిమానుల తాకిడి తట్టుకోలేరు. సెలబ్రిటీ హోదాలో ఆ అనుభవాలను ఎంజాయ్ చేసేవారు కొందరు.. ఇబ్బంది పడేవారు కొందరు. భారత్ లోని హిమాలయాల్లో తనకు ఎదురైన ఇలాంటి వింత అనుభవాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది హాలీవుడ్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్. ఈ పేరు కంటే ‘టైటానిక్ హీరోయిన్’ గా ఆమెకు వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపు ఎనలేనిది. 44 ఏళ్ల ఈ భామ అప్పట్లో ఓ సంచలనం.

IHG

 

‘ఈ సినిమా విడుదలైన కొన్నేళ్లకు భారత్ పర్యటనకు వెళ్లాను. నా టూర్ లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత హిమాలయా పర్వతాల అందాలను ఆస్వాదించేందుకు వెళ్లాను. అక్కడ ఓ ప్రాంతంలో ఉన్న మంచు కొండల ప్రాంతంలో నడుస్తూండగా ఓ వృద్థుడు తారసపడ్డాడు. ఆయన ఓ ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు. ఆయనకు సుమారు 85 ఏళ్లు ఉంటాయి. పైగా ఆయనకు ఒక కన్ను లేదు. నన్ను చూసి ఆగిపోయిన ఆయన ‘యు టైటానిక్’ అన్నాడు. అవును అని నేను సమాధానం ఇవ్వగానే.. ఆయన తన చేతిని గుండెలపై పెట్టుకుని ఆనందంతో ‘థ్యాంక్యూ’ అనేసి వెళ్లిపోయాడు. ఆ క్షణంలో నా కంట కన్నీరు ఆగలేదు’ అని చెప్పుకొచ్చింది.

IHG

 

సినిమా ఇంతటి గుర్తింపును తీసుకొస్తుందా.. అని ఆ క్షణంలో ఆశ్చర్యపోయానని క్యాండిస్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ కు చెప్పుకొచ్చింది కేట్. టైటానిక్ 1997లో అమెరికాలో విడుదలవ్వగా.. భారత్ లో 1998 మార్చి 13న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రోజ్ క్యారెక్టర్ లో కేట్ నటన, అందం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. విజయవాడలోని ఊర్వశి థియేటర్ లో ఇంగ్లీష్ వెర్షన్ లోనే 197 రోజులు ప్రదర్శితమై సంచలనం రేపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: