కోలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్.  ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురుగా సిని రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి మొదట హీరోయిన్ గా నటించింది.  ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రల్లో నటించి ప్రస్తుతం లేడీ విలన్ గా నటిస్తుంది.  ఆ మద్య మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన  ‘సర్కార్’ లేడీ విలన్ గా ఢీ అంటే ఢీ అన్నట్లు నటించింది. ఆ మద్య తెలుగు లో సందీప్ కిషన్ నటించిన తెనాలిరామకృష్ణ మూవీలో విలన్ గా నటించింది.  అప్పట్లో విశాల్ నటించిన ‘పందెంకోడి 2’ లో విలన్ గ నటించి మెప్పించింది.  హీరోయిన్ పర్సనాలిటీ ఉన్నా.. ఏ పాత్రలో అయినా ఇమిడిపోతుంది నటన వరలక్ష్మీ శరత్ కుమర్.  

 

ఈ అమ్మడు సినీ రంగంలోనే కాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ విషయాల్లో తనదైన మార్క్ చాటుకుంటుంది.  తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ స‌మ‌యంలో అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. ఇలా ఇంటి ప‌ట్టున వున్న వాళ్ల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ఇళ్ల‌ల్లోనూ ర‌క్ష‌ణ లేద‌ని వ‌రల‌క్ష్మి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.  కొంత మంది మగవాళ్లు మానసికంగా కృంగిపోవడం.. ఆ కోపం తమ తల్లి,భార్య, కూతుళ్లపై చూపించడం జరుగుతుందని వాపోయింది.

 

ఈ లాక్‌డౌన్ వేళ మ‌హిళ‌ల‌పై వేధిపులు అధికం అయ్యే ప్ర‌మాదం వుంద‌ని, నాలుగు గోడ‌ల మ‌ధ్య వారి ఆర్త‌నాదాలు బ‌య‌టికి వినిపించ‌వ‌ని, ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని వ‌ర‌ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ లాక్‌డౌన్‌లో వారిని గృహ హింస నుంచి కాపాడుదాం. ద‌య‌చేసి మీకు తెలిసిన మ‌హిళ‌ల‌కు 1800 102 7282 నంబ‌ర్‌ను షేర్ చేయండి అని పోస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: