క్లాసులు ఎగ్గొట్టే స్టూడెంట్స్ కు, గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయాలనుకునే కుర్రాళ్లకు కనిపించే మొదటి ఆయుధం సినిమా. వీకెండ్ ప్లాన్ చేసుకునే కామన్ మెన్ కు ఫస్ట్ హాలిడే స్పాట్ థియేటర్. ఇలా చాలామంది లైఫ్ లో ఒక భాగంగా మారిపోయిన థియేటర్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లోకి వెళుతోంది. కరోనా ప్రభావంతో ఒక ఏడాది వరకు థియేటర్ ఇండస్ట్రీ నష్టాలతోనే రన్ అయ్యేలా కనిపిస్తోంది. 

 

స్మాల్ స్క్రీన్, యూట్యూబ్, డిజిటల్ స్ట్రీమింగ్ నెట్ వర్క్స్ ఎన్ని వచ్చినా సినిమాలకు మెయిన్ ఫ్లాట్ ఫామ్ మాత్రం సినిమా హాళ్లే. థియేటర్ బిజినెస్ బాగుంటేనే ఇండస్ట్రీ లాభాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు కరోనా ప్రభావంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ఫ్యూచర్ లో థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోతారని విశ్లేషకులంతా అభిప్రాయపడుతున్నారు. 

 

లాక్ డౌన్ ముగిసినా ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేసినా కొన్నాళ్లపాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ఇంతకుముందులా సినిమా హాళ్లకు వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఓఓటీ ప్లాట్ ఫామ్స్, శాటిలైట్ మార్కెట్స్ లో సినిమాలు రిలీజ్ చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

ఒకప్పుడు శాటిలైట్ మార్కెట్ పీక్స్ లో ఉంది. ఆ టైమ్ లో శాటిలైట్ మార్కెట్ ను చూసుకొని చిన్న సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనో.. లేకపోతే టీవీల్లోనూ రిలీజ్ చేయాలని అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు కూడా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. నిర్మాతలకు లాభమొస్తే లక్ష్మీబాంబ్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తానంటున్నాడు అక్షయ్. 

 

ఓటీటీ ప్లాట్ ఫామ్ పెరిగిపోయాక థియేటర్ కు వెళ్లే ప్రేక్షకులే తగ్గిపోయారు. చాలా సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో మరో ఆరునెలల వరకు సినిమాహాళ్లు మాములు స్టేజ్ కు వచ్చేలా కనిపించడం లేదు. దీనికి తోడు కరోనా ఎఫెక్ట్ తో సామాన్యుల ఆర్థిక పరిస్థితి కూడా చితికిపోతోంది. వందలు ఖర్చుపెట్టి వినోదాన్ని కొనేవాళ్లు తగ్గిపోతారు. దీంతో థియేటర్ ఇండస్ట్రీ కొన్నాళ్లపాటు నష్టాలతోనే సహవాసం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు మార్కెట్ పండిట్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: