టాలీవుడ్ లో ఒకప్పుడు అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించే వారు. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఏ విధంగా చూసినా కనపడటం లేదు. ప్రస్తుతం ఆమె తో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆమె సినిమా ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఒక రెండు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత తాను ఇక వయసు కి తగిన పాత్రలు చెయ్యాలి అనే ఆలోచనలో ఉంది. 

 

ప్రభాస్ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర నటించే అవకాశం ఉందని టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆమె ప్రస్తుతం ఒక సినిమాలో నటించగా రెండు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తుంది. ఇక నుంచి అమ్మా అక్కా అనే సినిమాల్లో నటించాలి అని భావిస్తుంది. ఇలాంటి పాత్రలు చేస్తాను అని దర్శక నిర్మాతలకు ఆమె చెప్పినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె తో సినిమా చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా ఆమెకు కీలక పాత్రలు ఇస్తారని అంటున్నారు. 

 

మరి ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె ఎలాంటి సినిమాలు చేస్తుంది ఏ సినిమా చేస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రభాస్ సినిమాలో ఏ పాత్ర చేస్తుంది అనేది చూడాలి. మన తెలుగు హీరో లు కూడా ఆమె తో సినిమా చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. మరి ఏ సినిమాలో నటిస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: