టాలీవుడ్ జనాలు ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా వచ్చినా చాలు అనుకునే భావన లో ఉన్నారు. పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు కూడా ఎప్పుడు సినిమా చేస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం అనేది చాలా వరకు కష్టం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనితో హీరోలు కూడా ఎం చేయ్యాలి అనే దాని మీద ఆలోచనలో పడ్డారు. ఇప్పటిలో సినిమాలను విడుదల చేసే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధం కావడంతో చాలా వరకు ఆలోచనలో పడ్డారు. 

 

కొంత మంది హీరోలు సినిమాను ఆన్లైన్ లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పూర్తి అయిన చిన్న హీరోల సినిమాలను ఇప్పుడు చానల్స్ కి అమ్మాలి అని భావిస్తున్నారని సమాచారం. యుట్యూబ్ చానల్స్ తో పాటుగా సీరియల్స్ ని ప్రసారం చేసే చానల్స్ కి అమ్మే ఆలోచనలో ఉన్నారట. సినిమాలు కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నాయి . ఇప్పుడు ఆ సినిమాలను ఆన్లైన్ లో పాటుగా టీవీ చానల్స్ కి అమ్మితే  మంచిది అనే భావన లో ఉన్నారని అంటున్నారు అగ్ర హీరోల సినిమాలు మాత్రం లాక్ డౌన్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. 

 

ఈ లోగా చిన్న హీరోల సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఆన్లైన్ లో వచ్చే సే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నిర్మాతల మండలి లో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అందరూ ఒక అంచనాకు వచ్చి అవగాహన కు వచ్చి సినిమాను విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారని టాక్. మరి ఎన్ని సినిమాలను విడుదల చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం నిర్మాతలు బాగా నష్టాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: