ప్రపంచంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ మామూలుగా లేదు.. చిన్నా.. పెద్ద దేశాల్లో కరాళ నృత్యం చేస్తుంది.  అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఇప్పటికీ 50 వేల మంది మరణించారంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.  అమెరికా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ లాంటి దేశాల్లో ఉంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మహ్మారి మన దేశంలో కూడా విజృంభిస్తుంది.  కరోనా ప్రభావంతో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  చాలా మంది ఎంప్లాయిస్ ఇంటి వద్ద ఉండే తమ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.  ఇక వర్క్‌ ఫ్రమ్ హోం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని రకాల జోక్‌లు వైరల్ అవుతున్నాయి.

 

 ఇంటి వద్దనే కదా అని రిలాక్స్ గా  ఉంటున్నారు.  సాదారణంగా ఆఫీసులకి సూటులో వచ్చే వారు ఇప్పుడు లోయర్స్, లుంగీలతో ఇంట్లో పని చేస్తున్నారు. ఒక్కసారే తమ బాస్ లైవ్ లోకి రావడంతో అలాగే దర్శనం ఇస్తూ సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా  ఇలాంటి సంఘటనే అమెరికాలో ఒకటి జరిగింది. అమెరికాకు చెందిన ఓ న్యూస్ ఛానల్‌లో మార్నింగ్ లైవ్ షోలో భాగంగా ఇంటి నుంచి పని చేస్తున్న ఓ జర్నలిస్ట్‌ వైపుకు సడెన్‌గా కెమెరా తిరిగింది.  మనోడు కంగారుగా పైన సూట్ వేసుకున్నాడు..కానీ పాయింట్ మాత్రం వేసుకోలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీడియా సేవలు కొనసాగుతూనే ఉంటాయి.

 

తమతో పాటు తమ సామాన్లను రవాణా చేయడం టీవీ జర్నలిస్టులకు అత్యంత కష్టమైన పని అయినప్పటికీ ఏదో విధంగా తమ సహచర ఉద్యోగులతో కమ్యూనికేట్ అవుతూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.  విచిత్రం ఏంటంటే ఇది కనిపించింది క్షణ కాలమే అయినా నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫొటోలు, తనపై నెటిజెన్లు వేస్తున్న జోకులపై సదరు జర్నలిస్ట్ స్పందించాడు. ఒక్కసారిగా లైవ్‌లోకి రావాల్సిన పరిస్థితుల్లో అలా జరిగిందని చెప్పుకొచ్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: