టాలీవుడ్ లో ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బ కాస్త గట్టిగానే ఉంది. పలు సినిమా షూటింగ్ లు అన్నీ కూడా ఇప్పుడు ఆపేశారు. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పడం ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా చెప్పడం కష్టం. కరోనా దెబ్బకు అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఆగిపోయాయి లాక్ డౌన్ లో సినిమాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పడం దాదాపుగా కష్టమే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొందరు దర్శకులు నష్టాల నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ఇనిమా చేయడానికి గానూ సిద్దమయ్యారు. ఆయన ఎప్పుడు ఈ సినిమాను మొదలు పెడతారు అనేది అరఆర్ఆర్ సినిమా తర్వాత తెలుస్తుంది. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది. రోజు రోజుకి కరోనా పెరగడం తో సినిమాల షూటింగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అంచనా వేయడం కూడా కష్టమే. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ కొత్త ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయితే ఆయన నానీ తో సినిమా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు త్రివిక్రమ్ హవా ఉంది. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో మంచి ఊపు ఈద ఉన్నాడు త్రివిక్రమ్. ఆయన సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే ఆయన నానీ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నట్టు సమాచారం మరి అనుకున్నది చేస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: