పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పనా తక్కువే.. ఆయన చేసిన సినిమాలు, చేసిన వసూళ్లు, సృష్టించిన రికార్డులు అందరికి తెలిసినవే.. ఆడియెన్స్ లోనే కాదు స్టార్స్ లో కూడా పవర్ స్టార్ కు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో యువ హీరో నితిన్ పవన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ అన్నది తెలుసు. అసలు నితిన్ పవన్ ఫ్యాన్ ఎలా అయ్యాడు అంటే.. పవన్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండే ఆయన ఫ్యాన్ అయ్యానని.. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వచ్చాయని.. ఇక తొలిప్రేమ, తమ్ముడు సినిమాలతో పవన్ అంటే ఇష్టం పెరిగిందని అన్నారు నితిన్. 

 

పవన్ నటించిన తొలిప్రేమ సినిమా టైటిల్స్ నుండి ఎండ్ కార్డు వరకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో సహా తాను చెప్పేస్తా అంటున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్ మీద ఆ ఇష్టమే తాను కూడా నటుడిని అవ్వాలని కోరిక కలిగిందని.. హీరోగా కాకుండా నటుడిగా అవ్వాలని అనుకున్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నితిన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తానె పెద్ద ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటాడు నితిన్. హీరోగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ నితిన్ కూడా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 

 

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో నితిన్ ఛల్ మోహన రంగ సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. తన సినిమా ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపిస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు. భీష్మతో హిట్ అందుకున్న నితిన్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: