తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది..దాంతో దర్శక నిర్మాతలు కూడా అదే పనిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.. ఇకపోతే .. ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..అందులో చాలా సినిమాలు మొదటి షో కే ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకొని దుకాణం సర్దుకున్నారు..అయిన కూడా దర్శకులు కొత్త యాంగిల్ లో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు..

 

 

 

 

 

 

 

 

ఇటీవల తెలుగులో వచ్చిన చాలా సినిమాలు కూడా అట్లట ఆడాయి.. తెలుగులో సంచలనాలు సృష్టించిన సినిమా అంటే అది ఆర్ఎక్స్ 100 తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి..  సినిమా తరువాత ఆయన ఒక మల్టీ స్టారర్ కథను తయారు చేసుకున్నాడు. రవితేజ .. సాయిధరమ్ తేజ్ .. నాగచైతన్య తదితరులకు ఆయన ఈ కథని వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లంతా కూడా ఆయా కారణాల వలన ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు.

 

 

 

 

అజయ్ భూపతికి రెండో ప్రాజెక్టును సెట్ చేయడమే చాలా కష్టమైపోయింది. మొత్తానికి ఆయన ఒక కథానాయకుడిగా శర్వానంద్ ను .. మరో కథానాయకుడిగా సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకుని, లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో విసిగిపోయిన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'నా కెరియర్లో తొలి మల్టీ స్టారర్ .. చివరి మల్టీ స్టారర్ ఇదే. మల్టీ స్టారర్ కథలను రాయడం ఒక ఎత్తు .. ఆ కథను చెప్పి హీరోలను ఒప్పించడం మరో ఎత్తు' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.అసలు అజయ్ మరో సినిమా ను కూడా మొదటి సినిమాను మించెలా చేస్తాడా లేక మరో కొత్త యాంగిల్ ను చూపిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: