మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిన్న చిన్న దర్శకులు ఆయన తో ఒక్క అవకాశం వస్తే చాలు అనే భావన లో ఉన్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హీరో మీద నమ్మకం ఉంటేనే పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు. కాని తారక్ విషయంలో మాత్రం అలా లేదు అని అంటున్నారు. టాలీవుడ్ లో అతనికి ఉన్న క్రేజ్ చూసి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అని భావిస్తున్నారని సమాచారం. చిన్న చిన్న నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ఇటీవల తారక్ వారికి కొన్ని షరతులను పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ లో తనకు ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని తారక్ ఈ విధంగా ఆలోచించాడు అని అంటున్నారు. భారీగా పారితోషికం అతను డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని త్రివిక్రమ్ తో అతను చేసే సినిమాకు భారీగా అడిగినట్టు సమాచారం. 50 కోట్ల వరకు అతను డిమాండ్ చేసాడు అనేది టాలీవుడ్ జనాల మాట. కొందరు దర్శకులు అయితే అతని రేటు చూసి సినిమాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. 

 

ప్రస్తుతం తారక్ కి ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. అతని పారితోషికం ఆధారంగా సినిమా బడ్జెట్ ని ప్లాన్ చేస్తున్నారు. అగ్ర నిర్మాతలు అయినా సరే ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతని కోసం బాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. బాలీవుడ్ హీరోలు కూడా ఆయన తో సినిమా చేయడానికి చర్చలు కూడా జరుపుతున్నారని టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి చేస్తాడో లేదో....

మరింత సమాచారం తెలుసుకోండి: