IHG

కెరీర్ ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్... ఆ సినిమాతోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో కార్ టైర్ల కింద చేతులు పెట్టడం మరియు బండలు పగులకొట్టించుకోవడం వంటి వాటితో పవన్ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు .అప్పటినుండి సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భద్రి , ఖుషి , తమ్ముడు వంటి చిత్రాలు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి . పవన్ కళ్యాణ్ అప్పట్లోనే మహేష్ బాబు తో కలసి టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీపడేవాళ్లు. అయితే విశ్లేషకులు  మాత్రం పవన్ ఆ రెండు సినిమాలు చేసి ఉండిఉంటే అప్పుడే నెంబర్ వన్ అయ్యేవాడని చెబుతున్నారు. అవేంటంటే పూరిజగన్నాథ్ తీసిన ఇడియట్ మరియు త్రివిక్రమ్ తీసిన అతడు సినిమా .

IHG

 

ఈ రెండు సినిమాలు తెలుగు లో మంచి హిట్ సినిమాలు గా నిలిచాయి. పూరిజగన్నాథ్ మొదట  ఇడియట్ స్టోరీ ని పవన్ కి చెప్పినప్పుడు ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి నచ్చక వదిలేసుకున్నాడు అయితే అదే స్టోరీ మంచి ఫేమ్ లో ఉన్న మహేష్ బాబుకు చెబితే సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ స్టోరీ రవితేజ చెంతకు వెళ్ళింది దెబ్బకి రవితేజ దిశ  తిరిగినట్లైంది ..ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టేసింది. త్రివిక్రమ్ కూడా అతడు స్టోరీని పవన్ కళ్యాణ్  ముందు వినిపించారట కానీ ఆ స్టోరీ లైన్ పవన్ కి నచ్చకపోవడంతో ఆ స్టోరీ కాస్త మహేష్ వద్దకు చేరింది .అప్పట్లో మంచి హిట్ సాధించిన చిత్రం అది ..ఆ సినిమా మీద క్రేజ్ ఎంతుందంటే ఇప్పటికి  టీవీ లో ప్రీమియర్ షో వేస్తె మంచి రేటింగ్ వస్తుండడమే . అయితే అప్పట్లో మహేష్ మరియు పవన్ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీపడేవాళ్లు. అయితే పవన్ కళ్యాణ్ ఆ రెండు హిట్స్ కొట్టి తన ఖాతాలో వేసుకొని ఉంటే ఎప్పుడో నెంబర్ వన్ అయ్యేవాడని విశ్లేషకులు భావిస్తున్నారు ....
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: