తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నలుగురు అగ్ర హీరోల్లో బాలకృష్ణ శైలి విభిన్నం. బాలకృష్ణ ఎన్నో మాస్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు చేసి సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలా చేసిన సినిమాల్లో ‘సింహ’కు ప్రత్యేక స్థానం ఉంది. బాలయ్య డైలాగ్ డిక్షన్, యాక్షన్ ను కొత్తగా  ఆవిష్కరించిన సినిమా ఇది. ఎన్నో ఏళ్ల తర్వాత బాలయ్యలోని కరెక్ట్ యాక్షన్ మోడ్ ను పర్ఫెక్ట్ గా చూపించాడు బోయపాటి. ఈ సినిమా విడుదలై నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది.

IHG

 

2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ఆకలిని తీర్చేసింది. ఓపెనింగ్ షో నుంచే హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వరద పారింది. బాలయ్య సినిమాకు హిట్ టాక్ వస్తే పరిస్థితేంటో సింహ మరోసారి నిరూపించింది. డాక్టర్ గా, కాలేజ్ లెక్చరర్ గా ఈ సినిమాలో బాలయ్య నటన అద్భుతం. కుర్చీలో ఠీవీగా కూర్చుని బాలయ్య ఇచ్చే సీరియస్ వార్నింగ్ వంటి సీన్లలో ప్రేక్షకులు లీనమైపోయారు. ఫస్టాఫ్ లో కాలేజ్ లెక్చరర్ గా విలన్లకు వార్నింగ్ ఇచ్చే డైలాగులు పేలిపోయాయి. హీరో క్యారెక్టరైజేషన్ ను హైఓల్టేజ్ లో చూపించాడు బోయపాటి. కథలోని సీరియస్ కు తగ్గట్టుగా బాలయ్య మేకోవర్ లో కూడా చేంజ్ తీసుకొచ్చాడు.IHG

 

బాలకృష్ణ చెప్పే డైలాగులకు విజిల్స్ పడ్డాయి. సినిమాలోని బాలయ్య నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా దక్కింది. సంగీతం అందించిన చక్రికి కూడా నంది అవార్డు వచ్చింది. 30కోట్లకు పైగా షేర్ రాబట్టి అప్పటికి బాలయ్య కెరీర్లో టాప్ గా నిలిచింది. బాలయ్య కెరీర్లో మరో శతదినోత్సవ చిత్రంగా.. ఆ ఏడాదికి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. విజయ యాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను దర్శించుకున్నాడు బాలయ్య. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: