'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. కాగా వాస్తవానికి త్రినాథరావు సీనియర్ హీరో వెంకటేష్ కోసం కథ సిద్ధం చేశారట. సురేష్ సంస్థ నిర్మాణంలో సినిమా చేయాలని భావించి కొద్ది రోజులపాటు ఈ స్క్రిప్టు పై వర్క్ కూడా చేశారట. అయితే ఇప్పుడు వెంకీ ఈ స్క్రిప్ట్ మీద ఇంటరెస్ట్ చూపించడం లేదంట. అందుకే ఈ కథను వెంకీ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మాస్ మహారాజ్ రవితేజ కొత్త కథలు వింటున్నారట. త్రినాథరావు చెప్పిన ఈ కథ రవితేజకు బాగా నచ్చిందట. తన ఇమేజ్‌ కు తగిన కథలో మార్పులు చేయడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పేశారట. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

 

రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను', 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని  సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు మాస్ మహారాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: