ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  సినిమా షూటింగులు ఆగిపోయాయి . దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు సినీ సెలబ్రిటీలు అందరూ కరోనా  పై  పోరాటంలో  భాగం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మరోవైపు  లాక్ డౌన్ లో చేయాల్సిన పనులకు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల మధ్య బీద రియల్ మాన్ చాలెంజ్ అని ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్  సమయంలో ఎవరి పనులు వారు చేసుకుని రియల్ మ్యాన్ గా  ఉండాలి అని ఛాలెంజ్ అర్థం. 

 

 

 ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది సినీ ప్రముఖులు ముఖ్యంగా రాజమౌళి, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, క్రిష్, అనీల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్, శోబు యార్లగడ్డ అందరు తమ తమ ఇళ్లలో ఉంటూ తామెంత స్టార్ అయినా ఇళ్లలో తమ పనులు తామే చేసుకుంటామని చూపించారు. 

 

 

వీళ్ళలో ది బెస్ట్ రియల్ మ్యాన్ ఎవరన్నది చెప్పడం కష్టం.. ఒకరికి ఈ అవార్డ్ ఇస్తే మరొక హీరో ఫ్యాన్స్ ఫీల్ అవ్వొచ్చు. అయితే ఇలాంటి టైం లో కూడా తమ కర్తవ్యాలని నిర్వర్తిస్తున్న పోలీసులు, డాక్టర్లు, రైతులను ఈ అవార్డు అందించడం బెటర్ అని చెప్పొచ్చు. అయితే కేవలం ఇలా ఇళ్లలో పనులు చేసుకోవడమే కాదు లాక్ డౌన్  సమయంలో సినీ కార్మికులకు హెల్ప్ చేయడానికి కూడా విరాళాల సేకరణ చేపట్టి కార్మికులందరికీ నిత్యావసరాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు టాలీవుడ్ లోని ప్రముఖులు. సినీ కార్మికులకు ఇబ్బంది ఎదురవకుండా  చేయూతనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: