ఆలియా భట్ వరుసగా సినిమాలకు సైన్ చేసి కూర్చుంది. కొన్ని సినిమాలకు షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. వరుసగా ఒకదాని తరువాత మరోకటి కంప్లీట్ చేయాలని అనుకొంది. కాని  ఈ స్టార్ హీరోయిన్ ప్లాన్ ను ముంచేసింది కరోనా.. ఇప్పుడు లాక్ డౌన్ తరువాత ఏం సినిమా కంప్లీట్ చేయాలో తెలియని కన్ఫూజన్ లో ఉన్నా కూడా .. ప్రభాస్ తో కొత్త సినిమాకు మాత్రం ఎప్పుడూ  సై అంటానంటోంది. 
 
ఈ ముద్దు గుమ్మ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియా 2020 కోసం దాదాపు 5 సినిమాలు ప్లాన్ చేసుకుంది. అందులో కొన్ని సినిమాలు షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. కాని ఈ మధ్యలో కరోనా లాక్ డౌన్ వల్ల ఆలియా షెడ్యూల్ అంతా మారిపోయింది. ప్రస్థుతం బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో గంగుబాయి కతియావాడి మూవీతో పాటు భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రా కూడా షూటింగ్ మధ్యలో ఉంది. 
 
ఆలియా ..తన తండ్రి మహేష్ బట్ డైరెక్షన్ లో సడక్ 3లో కూడా నటించాల్సి ఉంది. ఇక మరో పక్క తెలుగులో రాజమౌళి ప్రస్టేజియస్ మూవీ ట్రిపుల్ ఆర్ కు కూడా సైన్ చేసింది ఆలియ. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా నటించబోతోంది. అయితే లాక్ డౌన్ ముందు వరకు ఈ మూవీస్ కు సరిపోను షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంది ఆలియ. కాని ఇప్పుడు దాదాపు రెండు నెలలు నుంచి లాక్ డౌన్ ఉండటంతో..తరువాత ఏ సినిమాకు ఎలా.. డేట్స్ అడ్జెస్ట్ చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంది ఆలియా.

 

ఇటు ట్రిపుల్ మూవీ తో పాటు అటు బాలీవుడ్  లో ఆలియా చేస్తున్న 3 సినిమాలు  కూడా పెద్దవే.. మరి ఏ సినిమాకు ఇంపార్టెన్స్ ఇవ్వలో అర్ధం కాక తిప్పలు పడుతోంది ఆలియ. ఇంత టైట్ షెడ్యూల్.. లాక్ డౌన్ తరువాత ఎ సినిమాకు టైమ్ కేటాలించాలో తెలియని సిచ్యూవేషన్.. అయినా సరే తను మాత్రం టాలీవుడ్ లో ప్రభాస్ తో సినిమా అంటే అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెబుతానంటోంది ఆలియా.  ప్రభాస్ యాక్టింగ్.. గ్లామర్.. టోటల్ కటౌట్ అంటే చాలా ఇష్టమంటోంది. ఇప్పటికిప్పుడు ప్రభాస్ తో చేసే ఛాన్స్ వస్తే.. ముందు ప్రభాస్ సినిమానే కంప్లీట్ చేస్తానంటోంది ఆలియా.

మరింత సమాచారం తెలుసుకోండి: