టాలీవుడ్ లో ఇప్పుడు ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ సినిమా కూడా ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళే సూచనలు లేవు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా ఇప్పుడు విడుదలకు నోచుకోవడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. ఇక మన తెలుగులో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా భారీగా నష్టపోతున్నారు. అగ్ర హీరోల సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు నష్టాల్లోనే ఉన్నారు అనేది అర్ధమవుతుంది. మన తెలుగు హీరోలు ఇప్పుడు దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులను అలరించే కార్యక్రమం చేస్తున్నారు. నష్టాలను మర్చిపోతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏదోక రూపంలో సినిమా కార్మికులను ఆదుకోవడానికి గానూ తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో చాలా మంది అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి  అనే సంగతి తెలిసిందే. ఇలా అందరూ కూడా తమ బాధను మర్చిపోయి తెలుగులో ప్రేక్షకులను బాగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సినిమా ఉంటేనే చాలా మందికి సంతోషం ఉంటుంది. శతాబ్దం పైగా అయింది సినిమా వచ్చి. ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు మన తెలుగు సినిమా పడలేదు అనేది వాస్తవం. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరిగినా చాలు అనుకునే పరిస్థితిలో టాలీవుడ్ ఉందీ అనే విషయం అర్ధమవుతుంది. దీని నుంచి బయటకు రావడానికి అగ్ర హీరోలు కూడా తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది అయితే తమను ఎక్కడ ప్రేక్షకులు మర్చిపోతారో అని భయపడే పరిస్థితిలో ఉన్నారు అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తూ వీడియో లను పోస్ట్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: