మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా మారి వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమాజానికి సందేశాన్నిచ్చే కథాంశాలని ఎన్నుకుని సినిమాలు తీసే కొరటాల శివ మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మెగాస్టార్ చిరంజీవిని కొరటాల ఎలా చూపించనున్నాడో అన్న ఆసక్తి బాగా పెరిగింది.

 

అయితే ఈ సినిమాఅ గురించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. సినిమా టైటిల్ ఆచార్య దగ్గర నుండి కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చోటు దక్కించుకుందన్న వార్త వరకూ ఎన్నీ సోషల్ మీడియాలో వచ్చినవే. అయితే గమ్మత్తుగా అవి నిజం అయ్యాయి కూడా. మహేష్ బాబు కూడా ఆచార్యలో నటిస్తున్నాడన్న వార్త తప్ప దాదాపు అన్నీ నిజం అయ్యాయి. అయితే తాజాగా ఆచార్య మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

 

ఆచార్యలో రామ్ చరణ్ కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ల మధ్య గురుశిష్యుల సంబంధాన్ని చూస్తామట. రామ్ చరణ్ పాత్ర అరగంటకి పైగానే ఉంటుందట. అంతే కాదు రామ్ చరణ్ పక్కన హీరోయిన్ కూడా ఉండడం విశేషం. అయితే తాజగా రామ్ చరణ్ పాత్రపై ఒకానొక అప్డేట్ బయటకి వచ్చింది. రామ్ చరణ్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడని తెలిసిందే.

 

నక్సలైట్ గా కనిపించనున్న రామ్ చరణ్ పాత్ర మధ్యలో చనిపోతుందట, విలన్ల చేతిలో ఆ పాత్ర చనిపోతుందట. దాంతో చిరంజీవి ఆ పాత్రని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి సిద్ధపడతాడట. అంటే ఇది రివేంజ్ డ్రామా అని అర్థం అవుతుంది. కొణెదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: