స్పైడర్ మ్యాన్ నుంచి బ్యాట్ మ్యాన్ వరకూ అందరూ మేం ఇప్పుడే వచ్చేది లేదు... మమ్మల్ని చూడాలంటే ఇంకా చాల టైమ్ వెయిట్ చెయ్యాల్సి ఉంటుందంటున్నారు. ఈ సంవత్సరం రావాల్సిన సినిమాలు నెక్ట్స్ ఇయర్, వచ్చే సంవత్సరం రావల్సిన సినిమాలు ఏకంగా ఆ పై వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ చేసి  ఇప్పుడుప్పుడే హాలీవుడ్  సూపర హీరో సినిమాలు చూసే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు  హాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ లు. 

 

ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. స్పెషల్లీ పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ కనెక్ట్ అయిన స్పైడర్ మ్యాన్ సినిమాలు రెండూ వెనక్కివెళ్లిపోయాయి. ఇన్ టూ ద స్పైడర్ వర్స్ , స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ఈరెండు సినిమాల్లో ఇన్ టూ ద స్పైడర్ 2022 ఏప్రిల్ 8 నరిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని 2020 అక్టోబర్ 7 న రిలీజ్ చేస్తున్నట్టు ఫ్రెష్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది సోనీ హౌస్.

 

స్పైడర్ మ్యాన్ థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సిరీస్  సినిమా జులై 16, 2021 లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ కరోనా దెబ్బకి అది ఏకంగా 2021 ఇయర్ ఎండ్ నవంబర్ 5 కి వెళ్లిపోయింది. టామ్ హాలెండ్ నటిస్తున్న ఈ సినిమాపై విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సోనీ ప్రొడక్షన్స్ లో వస్తున్న మరో మూవీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ , వీనమ్- లెట్ దేర్ బి కార్నేజ్ సినిమా.. ఈ సంవత్సరం అక్టోబర్  లో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ .. నెక్ట్స్ ఇయర్ జూన్ 25 కి పోస్ట్ పోన్ అయ్యింది.
 
డిస్నీ మార్వెల్ స్టూడియోస్ ప్రెస్టీజియస్ గా తెరెకెక్కిస్తున్న సూపర్ హీరో సినిమాల్ని కూడా రీ షెడ్యూల్ చేసింది. డాక్టర్ స్టేంజ్  తో పాటు థార్ -లవ్ అండ్ థండర్ సినిమాల్ని పోస్ట్ పోన్ చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ నవంబర్ 5, 2021లో రిలీజ్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా మార్చి 25, 2022 కు వెళ్లింది. థార్ -లవ్ అండ్ థండర్ సినమా కూడా  2022 లో  ఫిబ్రవరి 18 న రిలీజ్ అవ్వాల్సి  ఉంది. 

 

సూపర్ హీరో సినిమాల్ని డిలేచేస్తోంది మార్వెల్, సోనీ ప్రొడక్షన్స్ మాత్రమే కాదు .. వార్నర్ బ్రదర్స్ కూడా ఈ కరోనా దెబ్బకి నష్టాల్ని తగ్గించుకోవడం కోసంసూపర హీరోల్ని లేట్ గా రమ్మంటున్నారు .  వన్ మోర్ సూపర్ హీరో సినిమా ద ఫ్లాష్ మూవీ జూన్ 3 2022 లో రిలీజ్ అవ్వాల్సి ఉంటే ఈ సినిమాని మరోనెల పోస్ట్ పోన్ చేశారు.

 

షాజమ్ 2 సినిమా కూడా 2022 ఏప్రిల్ 1 నరిలీజ్ అని అనౌన్స్ చేసి ఇప్పుడు నవంబర్ 4 2022 కు వెనక్కునెట్టారు. రాబర్డ్ పాటిసన్ నటిస్తున్న ద బ్యాట్ మ్యాన్ మూవీ వచ్చేసంవత్సరం జూల్ 25 న రిలీజ్ అవ్వాల్సి ఉంటే అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఇలా టాప్ ప్రొడక్షన్ హౌస్ లు .. టాప్ హాలీవుడ్ హీరోల సినిమాలన్నటింనీ ఈ కరోనా దెబ్బకి పోస్ట్ పోన్ చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: