బాలీవుడ్ లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తున్న పూజాహెగ్డే .. ప్రజెంట్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అందరూ స్టార్ హీరోల పక్కన ఎప్పుడెప్పుడు సినిమాలు ఛేద్దామా ఎప్పుడు ఆఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే ..ఈ భామ మాత్రం తీరా టాప్ స్టార్ తో సినిమా ఛాన్స్ వచ్చేసరికి అమ్మో … నావల్ల కాదంటోంది.

 

పూజాహెగ్డే ప్రజెంట్ టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . ఈ హీరోయిన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ లో వన ఆఫ్ ద హీరో హృతిక్ తో మొహంజదారో సినిమా చేసిన పూజా.. లేట్ గా అయినా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. ఇప్పుడిప్పుడే అవకాశాలు సంపాదిస్తోంది.

 

పూజా.. లాస్ట్ ఇయర్ హౌజ్ ఫుల్ 4  సినిమాతో  అక్షయ్ కుమార్ సరసన సూపర్ హిట్ కొట్టింది.  ఆ సినిమాతో అందరినీ ఎంటర్ టైన్ చేసిన పూజా కి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్సిచ్చాడు. సల్మాన్ ఖాన్ త్వరలో చెయ్యబోతున్న కభీ ఈద్ .. కభీ దివాళి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది పూజా. అంతేకాదు ఈ పెయిర్ స్క్రీన్  మీద ఫ్రెష్ గా కనిపిస్తుందనే సెలక్ట్ చేశామని చెబుతున్నారు మేకర్స్ . 

 

ఎప్పుడెప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేద్దామా అని హీరోయిన్లు వెయిట్ చేస్తుంటే ..ఈ భామ మాత్రం సల్మాన్ ఖాన్ సర్ తో ఛాన్స్ వచ్చింది సరే.కానీ ఆయనతో స్క్రీన్ ఎలా షేర్ చేసుకుంటానో అని నెర్వస్ గా ఉంది. అసలు ఆ షూటింగ్ ఎలా జరగుతుందో ఇమాజిన్ చేసుకుంటుంటేనే టెన్షన్ గా ఉంటోందని చెబుతోంది. ఎందుకలా అంటే .. సల్మాన్ ఖాన్ చాలా సీనియర్ హీరో, ఆయన స్టేచర్ ని స్క్రీన్ మీద మ్యాచ్ చెయ్యగలుగుతానో లేదో అని భయంగా ఉందంటోంది పూజా. అయితే ..సీనియర్లతో వర్క్ చెయ్యడం వల్ల ఎంతో నేర్చుకోవచ్చని, స్క్రిప్ట్ కూడా ఫన్నీ గా ఎంటర్ టైనింగ్ గా ఉంది కాబట్టి.. ఈజీగానే ఉంటుందేమో అని డౌట్ ఫుల్ గానే చెబుతోంది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: