టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుల‌ది ఒకొక్క‌రిది ఒక్కో స్టైల్‌. ఇక ద‌ర్శక ధీరుడు రాజమౌళి మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్ద‌రూ ఈ ఇద్దరూ తెరకెక్కించే సినిమాలు వీళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నట్లైతే జులాయి సినిమాలోని డైలాగు లా రాజమౌళి సినిమాలో మ్యాజిక్ లు కనపడితే త్రివికమ్ సినిమాల్లో లాజిక్ లు కనపడతాయి. దీనితో వీరిద్దరి సినిమాలు భిన్న దృవాలుగానే ఉంటాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం వీరిద్దరూ కామన్ గా దొరికేశారు.

 

దీనితో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అంతా కూడా వీరే హాట్ టాపిక్ గా మారారు. హాలీవుడ్ సినిమాల నుంచి సీన్లను కాపీ కొట్టి మక్కీకి మక్కీ దింపేసి ఈ ఇద్దరు దర్శకులు దొరికిపోయారు. వీర‌ద్ద‌రి స్టైల్ దాదాపుగా అలానే ఉంటుంది. ముఖ్యంగా అయితే త్రివిక్రమ్ కాపీ కొట్టిన సీన్లు అయితే సోషల్ మీడియాలో కుప్పలు తెప్ప‌లుగా ప‌డి ఉండ‌డ‌మే కాక అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

 

ఇక రాజమౌళి విషయానికి వచ్చినట్లైతే తాను తీసే చారిత్రాత్మక చిత్రాల‌న్నీ కూడా దాదాపు అన్నీ యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ నుంచి లేపేసినవే అని ఎప్పటి నుంచో వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి బాహుబలి 2 క్లైమాక్స్ యాక్షన్ సీన్ వరకు రాజమౌళి చాలా కాపీలు కొట్టడానికి సోషల్ మీడియాలో వీరిద్దరే ప్ర‌స్తుతం టార్గెట్ గా హాట్ టాపిక్ నడుస్తుంది.

 

ప్ర‌స్తుతం నేడు చాలా  అడ్వాన్స్ డ్ రోజులు టెక్నాల‌జీ బాగా పెరిగిపోవ‌డంతో ఎక్క‌డ ఏమి జ‌రిగినా వెంట‌నే తెలుసుకోవ‌చ్చు. కాబట్టి ప్ర‌తి ఒక్క‌రూ కూడా  అన్ని విషయాల‌ను తెలుసుకుంటున్నారు. వీరు ఇతర సినిమాల నుంచి ప్రేరణ” అనే తీసుకున్నా అది వారి మీద “కాపీ” అనే పడుతుంది. సో వీరు ఇక నుంచి పూర్తిగా కొత్త కంటెంట్ ను చూపాల్సిందే. ఇంకెన్నాళ్ళు ఇలా కాపీ కొడుతూ బ్ర‌తికేస్తారంటూ చాలా మంది సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: