ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ ముంబాయిలోని హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. రిషీ కపూర్ మరణంపై బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది.  కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త నుంచి తేరుకోక ముందే రిషి కపూర్‌ మరణించడంతో సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.  కాగా రిషి కపూర్ 1973లో బాబీ సినిమాతో రుషి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దివానా, కాదల్, లైలా మజ్నూ, చాందినీ లాంటి సినిమాలను ఆయన చేశారు.

 

1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.  మంచి మిత్రుడిని కోల్పోయానని బిగ్ బి అమితాబ్ కన్నీరు పెట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు టాలీవుడ్ నటులు కూడా రుషికపూర్ మానానికి సంతాపం తెలిపారు. గొప్ప నటుడు మనకు దూరమయ్యారని  కన్నీటి అశృనివాళులర్పించారు టాలీవుడ్ నటులు.  పవన్ కళ్యాన్, సాయిధరమ్ తేజ్,  మంచు విష్ణు, మంచు లక్ష్మి , రామ్ చరణ్.

 

ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. 'హార్ట్ బ్రేకింగ్.. నిన్ననే  మంచి ప్రతిభ కలిగిన ఇర్ఫాన్ ఖాన్ ని కోల్పోయాం. కొద్దిసేపటి క్రితమే రిషి కపూర్ సాబ్ ని కోల్పోయాం.. ఇండియన్ సినిమాకు ఇది విధ్వంసకర నష్టం' అని ఎన్టీఆర్ ట్విట్ చేశారు.మరో లెజెండ్ రిషి కపూర్ సర్ మనల్ని విడిచి వెళ్లిపోయారు.  రిషి కపూర్ సర్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ వరలక్ష్మి సంతాపం తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: