రికార్డుల గోల ఇప్పటి వరకు హీరోలనే వెంటాడింది. ఒకరిని మించి మరొకరు వసూల్ చేయాలని.. కలెక్షన్ల రికార్డ్స్ బ్రేక్ చేయాలని టార్గెట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ రికార్డుల గోల మ్యూజిక్ డైరెక్టర్లను తాకింది. మళ్లీ పాతరోజులను గుర్తు చేస్తూ.. మ్యుజీషియన్స్ కు టార్గెట్స్ సెట్ చేస్తున్నాయి. 

 

అల వైకుంఠపురములో ఆల్బమ్.. మ్యూజిక్ డైరెక్టర్లకు కొత్తకొత్త టార్గెట్స్ సెట్ చేస్తోంది. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ ఆల్బమ్ బిలియన్ కు పైగా ప్లే అవుట్స్ సాధించింది. ఇక ఈ పాటలు ఇప్పటికీ ఛార్ట్ బస్టర్ లో ఉంటున్నాయి. దీంతో మిగతా మ్యూజిక్ డైరెక్టర్లపై ఈ సాంగ్స్ ను మించిపోయేలా ట్యూన్స్ కంపోజ్ చేయాలనే ప్రెజర్ పెరుగుతోందట. 

 

అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా పుష్ప. సహజత్వానికి దగ్గరగా రూపొందుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆటోమేటిక్ గానే బన్ని ఈ మూవీని ఆల్బమ్ ని కూడా వైకుంఠపురం రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తాడు. ఈ అంచనాలు దేవిపై ఒత్తిడి పెంచే అవకాశముంది. 

 

సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కు సూపర్ ట్రాక్ రికార్డ్ ఉంది. వీల్లిద్దరి కాంబోలో వచ్చిన ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. పైగా పీరియాడికల్ డ్రామాగా రూపొందిన రంగస్థలం సినిమాకు అదిరిపోయే పాటలు ఇచ్చాడు దేవి. పుష్ప కూడా ఇలాగే రస్టిక్ గా తెరకెక్కుతోంది. సో ఈ కథకు తగ్గట్టుగా దేవి కూడా మెస్మరైజింగ్ ట్యూన్స్ ఇస్తాడని చెప్పొచ్చు. 

 

ఇప్పుడు స్టార్ హీరోలంతా అలవైకుంఠపురము రేంజ్ ఆల్బమ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కెరీర్ లో ఇలాంటి హిట్ సాంగ్స్ ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఈ ఆశలే మ్యూజిక్ డైరెక్టర్లపై ప్రెజర్ పెంచుతున్నాయి. కాంబినేషన్స్ తో పెరిగే అంచనాలు ఈ ఒత్తిడిని మరో స్టేజ్ కు తీసుకెళ్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: