టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అతని సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఆయన అభిమానులకు పండగే. ఆయన సినిమా కోసం నిర్మాతలు దర్శకులు ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న చిన్న దర్శకులు అయితే ఆయన తో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. అగ్ర దర్శకులు ఆయన తో సినిమా అంటే చాలు చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా దర్శకుడి గా సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్. కథను చాలా జాగ్రత్తగా చూడాలని ఎందుకంటే తాను ఇప్పుడు తన ఇమేజ్ ని పక్కన పెట్టి ఈ సినిమా చేస్తూ వస్తున్నా అని బన్నీ సుకుమార్ కి చెప్పినట్టు సమాచారం. సుకుమార్ అందుకే ఇప్పుడు కాస్త కంగారు పడుతున్నాడని అంటున్నారు. 

 

వాస్తవానికి అల్లు అర్జున్ ప్రయోగాలకు చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. నా పేరు సూర్య సినిమా తర్వాత అతను కాస్త కంగారు పడ్డాడు కూడా. అందుకే ఇప్పుడు సుకుమార్ తో కొన్ని సూచనలు కూడా చేసుకున్నాడని సమాచారం. దీని వలన తాను నష్ట పోయే అవకాసం ఉండకూడదు అని చెప్పాడట. దీనితో సుక్కు కూడా ఇప్పుడు చాలా వరకు జాగ్రత్త గా సినిమాను ముందుకు తీసుకుని వెళ్తున్నాడని అందుకే ఇన్ని రోజులు కూడా విలన్ విషయంలో ఆలస్యం అయింది అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: