టాలీవుడ్ తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు తండ్రీ కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మెలుగుతుంటారు. వీరిద్దరి బంధం గురించి ఇంతవరకు ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. ఇప్పుడు ఇద్దరు పోటాపోటీగా సినిమాలు తీస్తూ అభిమానులను ఖుషీ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే చెర్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా 8 సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్‌ బెల్ట్‌తో చెర్రీని కొట్టారట చిరు. ఈ విషయాన్ని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నా చిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే నాన్న నా మీద చేయి చేసుకున్నారు. నాకు ఎనిమిదేళ్ల వయస్సులో మా ఇంటి గేట్‌ వద్ద డ్రైవర్, సెక్యూరిటీ మాట్లాడుకోవడం నేను విన్నాను. వారు మాట్లాడిన వాటిలో చాలా వాటికి నాకు అర్థం తెలీదు. దాంతో ఇంట్లోకి వెళ్లి వాటికి అర్థమేంటని బాబాయి నాగబాబును అడిగాను. అదే సమయానికి నాన్న షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చారు. ఆ తరువాత బాబాయి నన్ను నాన్న రూమ్‌కు తీసుకెళ్లి.. వీడు కొన్ని అసభ్యకర మాటలు నేర్చుకున్నాడు అంటూ కంప్లైట్ ఇచ్చాడు. వెంటనే రూమ్‌లో నుంచి బాబాయిని పంపిన నాన్న.. మా తాత గిఫ్ట్‌గా ఇచ్చిన బెల్ట్‌తో నన్ను కొట్టారు. అవి మంచి మాటలు కాదని.. ఎప్పుడూ అలాంటివి మాట్లాడకని తరువాత చెప్పారు. ఈ ఘటన తరువాత నాగబాబు బాబాయితో నేను చాలా రోజుల వరకు మాట్లాడలేదు' అని తెలిపారు. అయితే ఇప్పటికీ నాన్నతో ఏదైనా చెప్పాలంటే ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఉపాసన మాత్రం ఫ్రీ గా నాన్నగారితో మాట్లాడేస్తుంది. నాన్న ఉపాసన మామా కోడళ్ళులా కాకుండా స్నేహితులుగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తుండగా రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: