తెలుగులో సినిమా హిట్ అయితే ఆ సినిమాను సోషల్ మాద్యమలా ద్వారా కానీ లేక యుట్యూబ్ ద్వారా కానీ విడుదల చేస్తూ ప్రేక్షకుల చూపును మరల్చుకుంటారు.. అందుకు థియేటర్లలో సినిమా హిట్ అవ్వకున్నా కూడా వీటి ద్వారా విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించాయి.. అది ఇప్పటి సినిమాల పరిస్థితి.. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి..

 

 

 

 

అసలు విషయానికొస్తే..  లాక్ డౌన్ వేళా ఖాళీగా ఉంటున్న జనం, రెగ్యులర్ ఎంటర్ టైన్మెంట్ ను మిస్ అవుతున్నారు. దక్షిణాదిలో అయితే ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటీటీలు జనానికి బోలెడంత ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాయి. కానీ ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఓటీటీలను అంతగా పట్టించుకోవడం లేదు. దీనికి పలురకాల కారణాలు ఉన్నా, అవి అప్రస్తుతం. 

 

 

 

 

 

అయితే నార్త్ ఇండియన్స్ యూట్యూబ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ కంటెంట్ లో ఎక్కువగా ప్రాంక్ వీడియోస్, టిక్ టాక్ వీడియోలను తిలకిస్తున్నారు. వీటి తరువాత నార్త్ ఇండియన్స్ అత్యధికంగా చూస్తున్న యూట్యూబ్ వీడియోలలో డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అందులోనూ తెలుగు డబ్బింగ్ సినిమాలను ఏ ఒక్కటి వదలకుండా చూస్తున్నారు. తాజాగా మన యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన నాలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి, యూట్యూబ్ లోకి ఎక్కాయి. అవన్నీ ఈ లాక్ డౌన్ సమయంలో ఒక్కో సినిమా వంద మిలియన్ వ్యూస్ దాటేశాయి. 

 

 

 

 

 

 

యూట్యూబ్ లో ఇదో సరికొత్త రికార్డుగా నమోదైంది. రామ్ నటించిన నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. అత్యధికంగా ‘ద సూపర్ ఖిలాడి - 3’ అదేనండి నేను శైలజ, ఇప్పటి వరకు 189 మిలియన్ వ్యూస్ రాబట్టగా, హలొ గురు ప్రేమకోసమే సినిమా 184 మిలియన్లు, ఉన్నది ఒకటే జిందగీ 157 మిలియన్లు సాధించాయి. గత సంవత్సరం పూరి - రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: